ఈ పుట ఆమోదించబడ్డది

నిద్రపోని సాధువు

241

తారకేశ్వర్‌లో ప్రఖ్యాతమైన ఒక గుడికి దారి తీశాను. క్రైస్తవుల్లో కేథలిక్కులు, ఫ్రాన్సులో లూర్ద్ అన్న పవిత్రస్థలమంటే ఎంత శ్రద్ధా భక్తులు చూపిస్తారో హిందువులు ఈ గుడి అంటే అంతటి భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్‌లో జబ్బుల్ని నయంచేసే అలౌకిక ఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిలో ఒకటి మా కుటుంబంలోవాళ్ళలోనే ఒకరికి అనుభవమయింది.

మా పెద్ద పినతల్లి ఒకసారి ఇలా చెప్పింది: “ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చుని, కటిక ఉపవాసం చేస్తూ, మీ శారద బాబయ్య గారి మొండి జబ్బు ఒకటి నయంకావాలని కోరుతూ ప్రార్థన చేశాను. ఏడో రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్ష మైంది! దాని ఆకులతో కషాయం కాచి మీ బాబయ్యగారికి ఇచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమయిపోయింది. మళ్ళీ ఎన్నడూ రాలేదు.”

పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి ప్రవేశించాను. అక్కడ వేదిక మీద ఒక గుండ్రాయి తప్ప మరేమీలేదు. అంతంలేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుణ్ణి సముచితంగా సూచిస్తోంది. భారతదేశంలో చదువుకోని రైతుకు కూడా అనంత విశ్వానికి సంబంధించిన అమూర్త కల్పనలు అర్థమవుతాయి; నిజానికి, అతను అమూర్తకల్పనల్లోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతన్ని నిందించారు!

ఆ సమయంలో నా మనస్సు ఎంత మొండికి వేసిందంటే, ఆ శిలా చిహ్నం ముందు తలవంచడానికి కూడా విముఖుణ్ణి అయాను. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే అని అనుకున్నాను.

దేవుడిముందు మోకరిల్లకుండానే ఆ గుళ్ళోంచి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రణబాజ్‌పూర్ గ్రామంవేపు విసవిసా నడుచుకుంటూ