ఈ పుట ఆమోదించబడ్డది

232

ఒక యోగి ఆత్మకథ

గమనించారు. ఒక రకంగా సులువుగా, మరోరకంగా కష్టంగాను ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైనదే.

దబ్రూ వల్లభ్‌గారు ఏకాంత వనప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. పవిత్రగ్రంథమైన భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక శ్లోకంమీద అరగంటసేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తరవాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచి పోయింది. గురువుగారు దానిమీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానంచేశారు. చివరికి గురువుగారు మాట్లాడారు.

“శ్లోకం అర్థం చేసుకున్నారా?”

“చేసుకున్నానండి.” ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు.

“లేదు; పూర్తిగా కాదు. శతాబ్దుల తరబడిగా భారతదేశానికి పునర్యౌవనం ప్రసాదించడానికి ఈ మాటలకు శక్తి నిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు.” మౌనంలో మరోగంట గడిచిపోయింది. గురువుగారు శిష్యుల్ని పంపేసి శ్రీయుక్తేశ్వర్‌గారి వేపు తిరిగారు.

“మీకు భగవద్గీత తెలుసా?”

“తెలియదండి; నా కళ్ళు నా మనస్సూ ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తాయే కాని, నిజంగా తెలియదండి.”

“వందలకొద్దీ జనం, దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు!” ఆ మహాసాధువు ఆశీఃపురస్సరంగా మా గురుదేవుల వేపు చిరునవ్వు నవ్వారు. “పవిత్రగ్రంథ సంబంధమైన సంపదను బయటికి ప్రదర్శించడంలో