ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

219

లేవి కాదు; వాళ్ళ లోపాలు కొట్టవచ్చినట్టు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించడం అరుదు. కాని తను సలహాకోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మట్టుకు శ్రీ యుక్తేశ్వర్‌గారు తమమీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు. అహంకారం చొరబారిన మానవులు అనే ముడిఖనిజాన్ని మార్చడానికి పూనుకొన్న గురువే నిజంగా ధైర్యశాలి! సాధువు సాహసం, మాయాజాలంలో ఇరుక్కొని కలవరపడే ప్రజలమీద అంటే, తడుములాడుకొనే గుడ్డివాళ్ళ లాటి ప్రాపంచిక జనులమీద- కలిగిన కరుణలో పాదుకొని ఉంటుంది.

నేను నాలో ఉన్న ఉడుకుబోతుతనాన్ని పోగొట్టుకున్న తరవాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది. గురుదేవులు అత్యంత సూక్ష్మరీతిలో కరిగి కరుణాన్వితులయారు. కొంతకాలానికి నేను మామూలుగా మానవ మూర్తిమత్వం తన కాపుదలకోసం అడ్డుపెట్టుకొనే హేతువాద విధేయత, అవచేతన[1] మనస్సులోని మినహాయింపు అనే ప్రతి గోడనూ కూలగొట్టాను. దానికి ఫలితంగా నాకు లభించిన బహుమానం, అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడడం. అప్పుడు నేను, ఆయన, మనిషిమీద నమ్మకముంచినవారని, మంచిచెడ్డలు ఆలోచించే

  1. రబ్బీ ఇజ్రాయల్ హెచ్. లెవింథాల్ న్యూయార్కులో ఇచ్చిన ఒక ఉపన్యాసంలో, “మన చేతనకూ అవచేతనకూ కిరీటం వంటిది అధిచేతన,” అన్నాడు. మనలో లోలోపల ఒక చెత్తకుప్ప, ఒక కోశాగారం కూడా మరుగుపడి ఉన్నాయని ఎఫ్. డబ్ల్యు. హెచ్. మేయర్స్ అనే ఇంగ్లీషు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చాలా ఏళ్ళకిందట అన్నాడు. అధిచేతనకు సంబంధించిన నవ్య మనోవిజ్ఞానశాస్త్రం, మానవ స్వభావంలోని అవచేతననే కేంద్రంగా చేసుకొని పరిశోధనలన్నీ సాగించే మనోవిజ్ఞానశాస్త్రానికి భిన్నంగా, కోశాగారం మీద, అంటే, మానవుల మహనీయ, నిస్వార్థ వీరోచిత కృత్యాన్ని వివరించగల ఏకైక మండలం మీద దృష్టి కేంద్రీకరిస్తుంది.