ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

217

భావులు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు! అయితే గురుదేవులు మళ్ళీ ఎన్నడూ నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టలేదు కాని ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు, ఎక్కడనుకుంటే అక్కడ, నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూ ఉండేవారు.

శ్రీయుక్తేశ్వర్‌గారు ఆమూలాగ్రంగా ఇతరుల్ని విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు. గురువుగారంతటి జ్ఞానులు మరి! దోషంలేని వివేకమూర్తులు మరి! కాని ఒకరిమీద దెబ్బతియ్యాలని చూసేవాడు తాను కాపుదల లేకుండా ఉండగూడదు. ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే, విమర్శ అనే తమ అమ్ముల పొదిలోంచి గురుదేవులు కొన్ని బాణాలు వాళ్ళవేపు దూసుకువెళ్ళేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర్నించి అనాలోచితంగా పలాయనం చిత్తగించారు.

“మెత్తని మందలింపులకే ఎదురుతిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు, సున్నితంగా తాకేలోగానే ఎదురుతిరిగే, రుజాగ్రస్తమైన శరీరావయవాల వంటివి.” పలాయనంచేసే వాళ్ళగురించి శ్రీయుక్తేశ్వర్‌గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది.

చాలామంది శిష్యులకు గురువుగారి గురించి ముందుగా ఊహించుకొన్న అభిప్రాయాలు కొన్ని ఉండడంతో, వాటినిబట్టి వాళ్ళు ఆయన మాటల్ని చేతల్నీ నిర్ణయిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు, శ్రీయుక్తేశ్వర్‌గారిని తాము అర్థంచేసుకోలేదనీ తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు.

“మీరు దేవుణ్ణి అర్థంచేసుకోరు!” అంటూ ఒక సందర్భంలో నేను మాటకు మాట తిప్పికొట్టాను. “ఒక సాధువు మీకు అర్థం కావడమే జరిగితే మీరే ఒక సాధువవుతారు!” సృష్టిలో కోటానుకోట్ల రహస్యాలు