ఈ పుట ఆమోదించబడ్డది

206

ఒక యోగి ఆత్మకథ

సూక్ష్మ నియమాలగురించి చెప్పడం అరుదు; కాని వాటిచేత తమ సంకల్పానుసారంగా రహస్యంగా పని చేయించేవారు.

“ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఆంతరిక ప్రేరణ పొందితేనే కాని అలౌకిక అద్భుత చర్య ఏదీ చెయ్యడు,” అని వివరించారు గురుదేవులు. “దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణ రహితంగా వెల్లడి కావాలని ఆశించడు.[1] అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన స్వతంత్రేచ్ఛ మీద, పరాధీనం చెయ్యరాని హక్కు ఉంది. ఏ సాధువూ ఆ స్వాతంత్ర్యానికి భంగం కలిగించడు.

శ్రీ యుక్తేశ్వర్‌గారిలో అలవాటుగా కనిపించే మౌనం, ఆయన పొందిన గాఢమైన ఈశ్వరానుభూతులవల్ల కలిగినది. ఆత్మసాక్షాత్కారం పొందని బోధకుల దినాలను ఆక్రమించుకొనే అంతులేని “అలౌకిక దర్శనాలు” ప్రదర్శించడానికి ఆయనకు టైము లేదు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఇలా చెప్తారు: “మెరక నీటివంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచనలనే చేపలే మహాసంక్షోభం కలిగిస్తాయి. మహాసముద్రాలవంటి మనస్సుల్లో దివ్యప్రేరణలనే తిమింగిలాలు ఏ సంచలనమూ కలిగించవు.”

మా గురుదేవుల నిరాడంబరత అనే ఆచ్ఛాదన కారణంగా, ఆయన సమకాలికుల్లో చాలా కొద్దిమందే, ఆయనను మానవాతీతులుగా గుర్తించారు. “తన జ్ఞానాన్ని మరుగుపరచలేనివాడు మూర్ఖుడు” అన్న నానుడి, పరమ జ్ఞానులు, శాంతమూర్తులు అయిన మా గురుదేవులకు ఎన్నడూ వర్తించదు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు, తక్కిన వాళ్ళందరిలాగే మానవ మాత్రు

  1. ” పవిత్రమైనదాన్ని కుక్కలకు వెయ్యకు, నీ ముత్యాల్ని, పందుల ముందుకు విసరకు; అలా కనక విసిరితే, వాటినవి కాళ్ళతో తొక్కేసి, మళ్ళీ నీ మీదికి ఎదురు తిరిగి, నిన్ను చీల్చేస్తాయి.” మత్తయి 7: 6 (బైబిలు).