ఈ పుట ఆమోదించబడ్డది

200

ఒక యోగి ఆత్మకథ

“గురుదేవా, నాకు చాలా జబ్బుగా ఉంటోందండి; బరువు చాలా పౌన్లు తగ్గిపోయాను.”

“యుక్తేశ్వర్,[1] నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది; ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నాననుకుంటున్నావు.”

“నే నాశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధాన మిది; అయితే ఆ తరవాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు:

“ ‘చూస్తాను; రేపటికి నీకు మెరుగనిపించాలని నా విశ్వాసం.’

“ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతికి సూచనగా ఆయన మాటల్ని గ్రహించింది, సూక్ష్మగ్రాహకమైన నా మనస్సు. మర్నాడు పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళి, ‘గురుదేవా, ఈ రోజు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందండి,’ అంటూ సంబరపడుతూ చెప్పాను.

“ ‘నిజమే! ఈ రోజు నువ్వు సత్తువ పుంజుకున్నావు.’

“ ‘కాదు గురుదేవా! నాకు సాయంచేసినవారు మీరు. కొన్ని వారాల తరవాత నాకు ఏమాత్రమయినా సత్తువ రావడం ఇదే మొదలు.’

“ ‘నిజమే. నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది; అది రేవు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?”

"ఆ బలహీనత మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనే నాలో

  1. నిజానికి లాహిరీ మహాశయులు ఆయన్ని సంబోధించింది “ప్రియా” (మా గురువుగారి పేరులో మొదటి భాగం). అనేకాని “యుక్తేశ్వర్” (సన్యాసం తీసుకొన్న తరవాత పెట్టిన పేరు; మా గురువుగారు లాహిరీ మహాశయుల జీవితకాలంలో ఈ పేరు పెట్టుకోలేదు) అని కాదు, ఈ పుస్తకంలో ఇక్కడా, మరికొన్ని ఇతర చోట్లా, రెండు పేర్లుంటే పాఠకులకు గందరగోళంగా ఉంటుందని, “యుక్తేశ్వర్” అన్న పేరే వాడడం జరిగింది.