ఈ పుట ఆమోదించబడ్డది

192

ఒక యోగి ఆత్మకథ

తుల విషయంలో నయితేనేం, మరే పనుల విషయంలో నయినా గురుదేవుల సృజనాత్మక ప్రతిభలో మౌలికత వ్యక్తమవుతూ ఉండేది.

ప్రశాంత సాయంసమయాల్లో తరచుగా, గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి; అవి అక్షయ సంపదలు. ఆయన పలికిన ప్రతి పలుకూ జ్ఞానంతో చికిలిచేసినట్టుండేది. ఆయన చెప్పే తీరులో మహోదాత్తమైన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఇది అద్వితీయమైనది. నా అనుభవంలోకి వచ్చినంతవరకు, ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడని తీరులో మాట్లాడేవారాయన. తమ ఆలోచనల్ని, మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించేముందు ఆయన, విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు. భౌతికరూపంలో సైతం సర్వవ్యాపకమైన సత్యసారం, ఆయనలోంచి ఆత్మ ప్రసరింపజేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది. సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వపు భారం, ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది.

శ్రీయుక్తేశ్వర్‌గారు సమాధిమగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే, ఆయన వెంటనే వాళ్ళతో ఇష్టాగోష్ఠి జరిపేవారు. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడంకాని, అంతర్ముఖత్వాన్ని చాటు కోడంకాని ఆయనకు చేతకావు. ఎప్పుడూ బ్రహ్మానందస్థితిలో మగ్నులై ఉన్నందువల్ల, సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకు అక్కర్లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి, ధ్యానమనే మెట్టు ఏనాడో దాటేసి ఉంటాడు. “కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది.” కాని శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోడం కోసమని సాధువులు, ఆధ్యాత్మిక సాధన ప్రక్రియల్ని పాటిస్తూ ఉంటారు.

అర్ధరాత్రి కావస్తోందంటే, మా గురువుగారు చిన్న పిల్లవాడికి