ఈ పుట ఆమోదించబడ్డది

188

ఒక యోగి ఆత్మకథ

స్పర్శతోనే, లెక్కలేనన్ని సూర్యబింబాలు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఒక్కుమ్మడిగా జ్వాజ్వల్యమాన మవుతున్నట్టుగా, ఒకనొక మహాతేజస్సు నా మీద ప్రసరించింది. అనిర్వచనీయమైన ఆనందపు వెల్లువ ఒకటి నా హృదయాన్ని నింపేసి అంతరాంతరాల్లోకి వ్యాపించింది.

ఆ మర్నాడు నేను ఆశ్రమం నుంచి బయలుదేరేందుకు సిద్ధం కాగలిగే సమయానికి అపరాహ్ణం దాటింది.

“నువ్వు ముప్పై రోజుల్లో తిరిగి వెడతావు.” నేను కలకత్తాలో మా ఇంటి గుమ్మంలో అడుగుపెడుతూ ఉండగా, గురుదేవుల జోస్యం ఫలించిన సంగతి మనస్సులో మెదిలింది. ఆకాశంలో “ఎగిరే పక్షి” మళ్ళీ గూటికి చేరడం గురించి మా చుట్టాలు సూటిపోటి మాటలంటారేమోనని నేను భయపడ్డాను గాని, అటువంటి దేమీ జరగలేదు.

నేను నా అటకమీదికి ఎక్కి, ఒక సజీవ వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నాను. “నా ధ్యానాలకూ, సాధనలో నాకు ఎదురయిన తుఫానులకూ సాక్షివి నువ్వే. ఇప్పుడు నేను గురుదేవులు అనే ఓడ రేవుకు చేరుకున్నాను.”

“బాబూ, మనకు ఉభయతారకంగా జరిగిందానికి సంతోషంగా ఉంది.” ప్రశాంతమైన సాయంసంధ్య వేళ నేనూ నాన్నగారూ కలిసి కూర్చున్నాం. “ఒకప్పుడు నేను మా గురుదేవుల్ని అత్యద్భుతంగా దర్శించినట్టుగానే నువ్వూ మీ గురువుగారిని దర్శించావు. లాహిరీ మహాశయుల పవిత్ర హస్తం మన జీవితాల్ని కాపాడుతూంది. మీ గురువుగారు, మనకి అందుబాటులో లేకుండా, హిమాలయాల్లో ఉండే సాధువు కారని, మనకి దగ్గరలోనే ఉన్నవారని రుజువయింది. నా ప్రార్థనలు ఫలించాయి; దేవుడికోసం చేసే అన్వేషణలో నువ్వు నా కంటికి శాశ్వతంగా దూరం కాలేదు.”