ఈ పుట ఆమోదించబడ్డది

162

ఒక యోగి ఆత్మకథ

తీసుకువెళ్ళారు. మే మిద్దరం మామిడిపళ్ళూ బాదం మిఠాయి తింటూ ఉండగా, నా స్వభావం తమకు బాగా సన్నిహితంగా తెలుసునన్న సంగతి ఆయన మా సంభాషణ క్రమంలో అలవోకగా తెలియజేశారు. సహజమైన నమ్రతలో అద్భుతంగా మేళవించిన ఆయన జ్ఞానసంపత్తికి విస్మితుణ్ణి అయాను.

"నీ రక్షరేకు కోసం విచారించకు. దాని అవసరం తీరిపోయింది.” గురుదేవులు, దివ్యదర్పణం మాదిరిగా నా యావజ్జీవిత ప్రతిబింబాన్ని ఆకట్టుకున్నారు.

“గురుదేవా, ప్రత్యక్ష వాస్తవముయిన మీ సన్నిధి ఇచ్చే ఆనందం ఏ సంకేతం ఇస్తుంది?”

“ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కణ్ణించి మారి పోవలసిన సమయం వచ్చింది.”

అంతవరకు నా జీవితానికి సంబంధించిన సంగతులేవీ నేను ఆయన దగ్గర ప్రస్తావించలేదు; ఇప్పుడవి అనావశ్యకాలనిపించాయి. ఆయన సహజమైన, సరళవైఖరిని బట్టి, తమ దివ్యదృష్టికి నేను ఆశ్చర్యం వెలిబుచ్చాలని ఆయన కోరడంలేదని గ్రహించాను.

“నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి. నీ సర్వమానవ ప్రేమ పరిధిలోంచి చుట్టాల్నెందుకూ మినహాయించడం?”

ఆయన సూచనకు నాకు దిగులు కలిగింది, మావాళ్ళు నన్ను తిరిగి రమ్మంటూ ఉత్తరాల్లో అనేకసార్లు వెల్లడించిన కోరికను నేను మన్నించ నప్పుటికీ నేను తిరిగి వస్తాననే, వాళ్ళు జోస్యం పలుకుతూ వచ్చారు. “పిల్లపక్షిని అధిభౌతిక ఆకాశంలో విహరించనియ్యండి,” అని వ్యాఖ్యానించా డొకసారి అనంతన్నయ్య. “ఆ దట్టమయిన వాతావరణంలో, వాడి