ఈ పుట ఆమోదించబడ్డది

154

ఒక యోగి ఆత్మకథ

ప్రతిరోజూ ఈ మూడు గంటల వ్యవధి మాత్రం మరింత దుర్భరమవుతోంది. కలకత్తాలో అయితే, ఒక్క పది నిమిషాల ఆలస్యానికి మా వంటవాణ్ణి తిట్టేసేవాణ్ణి; ఇప్పుడా రోజులు గతించాయి. ఇక ఆకలి అదుపులో పెట్టడానికి ప్రయత్నించాను; ఇరవై నాలుగు గంటల ఉపవాసం పూర్తి చేశాను. మర్నాడు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను.

“దయానందుల బండి ఆలస్యంగా వస్తుంది; ఆయన వచ్చేదాక మన మెవళ్ళం భోంచెయ్యం.” జితేంద్ర ఘోరమయిన ఈ వార్త తెచ్చాడు. రెండు వారాలపాటు ఊళ్ళోలేని స్వాములవారికి స్వాగత సూచకంగా రుచికరమైన వంటకాలెన్నో సిద్ధంగా ఉన్నాయి. ఆకలి పుట్టించే వాసన ఆశ్రమమంతటా నిండి ఉంది. వేరే ఏమీ దొరకనప్పుడు, నిన్నటిరోజు ఉపవాసమున్నానన్న గర్వం తప్ప, మరేముంటుంది మింగడానికి?

“దేవుడా, బండి తొందరగా రప్పించు!” దయానందులు నా నోరు కట్టెయ్యడానికి విధించిన నియమంతో, దివ్యప్రదాత అయిన భగవంతుడికి ఏమీ ప్రమేయం లేదని అనుకున్నాను. భగవంతుడి దృష్టి మరో చోట ఉంది. కుంటుకుంటూ నడుస్తున్న గోడ గడియారం గంటలు గడిపేసింది. మా స్వాములవారు గుమ్మంలో అడుగుపెట్టే వేళకి చీకటి పడుతోంది. నేను పట్టరాని సంతోషంతో ఆయనకి స్వాగతం చెప్పాను.

“దయానందులు ముందు స్నానంచేసి ధ్యానం చేసుకుంటారు; ఆ తరవాతే మనం వడ్డన చేసేది.” జితేంద్రుడు అపశకునపు పక్షిలా మళ్ళీ నా దగ్గరికి తయారయాడు.

నేను దాదాపు స్పృహ తప్పిపోయే స్థితిలో ఉన్నాను. ఖాళీగా ఉండడం కొత్త అయిన నా చిన్నారి కడుపు, ఆవురావురుమంటూ టొకా