ఈ పుట ఆమోదించబడ్డది

146

ఒక యోగి ఆత్మకథ

ల్లోనూ ముఖ్యంకాని సందర్భాల్లోనూ కూడా, దివ్యలీలలు కళ్ళకు కడుతూ వచ్చాయి. దేవుడి దృష్టిలో పెద్దా చిన్నా అన్న తేడా లేదు. అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అణువునే కనక నిర్మించి ఉండకపోతే ఆకాశం, అభిజిత్తూ స్వాతీవంటి నక్షత్రాల్ని సగర్వంగా అలంకరించుకొని ఉండగలిగేదా? ఇది “ముఖ్యమైనది”, అది “ముఖ్యంకానిది” అన్న విచక్షణలు దేవుడి కసలు తెలియనే తెలియవు; లేకపోతే, ఒక సూది కనక లేకపోతే మొత్తం విశ్వమంతా కుప్పగూలిపోయేది!