ఈ పుట ఆమోదించబడ్డది

142

ఒక యోగి ఆత్మకథ

“మాస్టరుగారు నన్ను చూడమనే బై స్కోపు ఇదన్నమాట!” నా ఆలోచనకు ఓర్పు నశించింది కాని నా ముఖంలో విసుగుదల కనబరిచి ఆయన్ని నొప్పించదలచలేదు. కాని ఆయన నావేపు వంగి రహస్యంగా ఇలా చెప్పారు:

“చిన్నబాబూ, నీకు ఈ బై స్కోపు నచ్చనట్టవుపిస్తోంది. ఈ సంగతి జగన్మాతకి చెప్పాను; ఆవిడకి మనిద్దరి మీదా పూర్తిగా సానుభూతి ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు పోతాయనీ, మనం ఈ గదిలోంచి వెళ్ళిపోయే వరకూ మళ్ళీ వెలగవనీ చెబుతున్నది.”

ఆయన గుసగుసలు పూర్తి అయేసరికి హాలంతా చీకటయిపోయింది. ఉపన్యాసమిచ్చే ఆయన గంభీరస్వరం, ఆశ్చర్యంతో ఒక్క క్షణం నిలిచి పోయింది. ఆ తరవాత ఆయన, “ఈ హాల్లో ఎలక్ట్రిక్ సిస్టంలో ఏదో లోపమున్నట్టుంది,” అన్నాడు. అప్పటికి నేనూ మాస్టర్ మహాశయులూ గడపదాటేస్తున్నాం. నడవలోంచి వెనక్కి తిరిగి చూస్తే హాల్లో మళ్ళీ దీపాలు కనిపించాయి.

“చిన్న బాబూ, ఆ బైస్కోపు నీకు నిరాశ కలిగించింది కదూ! అయితే మరో రకంది. నీకు నచ్చుతుందనుకుంటాను.” ఆయనా నేనూ యూనివర్సిటీ భవనానికి ఎదురుగా ఉన్న దారిలో, నించుని ఉన్నాం. నా గుండెమీద ఆయన మెల్లగా తట్టారు.

వెంటనే పరివర్తనాత్మకమైన నిశ్శబ్దం ఒకటి ఆవరించింది. ఆధునికమైన “టాకీలు”. శబ్ద పరికరాలు చెడిపోయినప్పుడు మూక చలన చిత్రాల్లా ఎలా మారిపోతాయో అలా, ప్రపంచంలోని కోలాహలాన్నంతని అతివిచిత్రమైన అలౌకిక ఘటనద్వారా దివ్యహస్తం అణిచేసింది. కాలి నడకని వెళ్ళేవాళ్ళూ, సాగిపోతున్న ట్రాలీ కార్లూ, మోటారు బండ్లూ,