ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ప్రపంచ ప్రజలందరి ఏకత్వానికి దేవుడితో బాంధవ్యమనే శాశ్వత ప్రాతిపదిక ఉందని బోధించి వాళ్ళలో సోదరభావం వ్యాప్తి చేయడం.

శరీరంకన్న మనస్సుకూ మనస్సుకన్న ఆత్మకూ ఆధిక్యం ఉందని నిరూపించడం.

చెడును మంచితోనూ విచారాన్ని సంతోషంతోనూ క్రూరత్వాన్ని దయతోనూ అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించడం.

విజ్ఞానశాస్త్రానికి మతానికి ఆధారభూతమయిన సూత్రాల ఏకత్వాన్ని అనుభూతం చేసుకొని దానిద్వారా ఆ రెంటినీ ఏకంచేయడం,

తూర్పు, పడమటి దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవగాహన పెంపొందాలనీ వాటి సునిశిత విశిష్ట లక్షణాల వినిమయం జరగాలనీ ఉద్బోధించడం.

మానవజాతిని విస్తృతమయిన తన ఆత్మగానే గ్రహించి సేవ చేయడం.