ఈ పుట ఆమోదించబడ్డది

గాలిలో తేలే సాధువు

107

శయుల మఠం మీదగా వెళ్తూ, ఆయన్ని ఒకసారి కలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆ యోగిగారు, మామూలు జనానికి అందుబాటులో లేరు. కింది అంతస్తులో ఒక శిష్యుడు కూర్చుని, గురువుగారి ఏకాంతానికి భంగం కలక్కుండా కాపలా కాస్తున్నాడు. ఆ శిష్యుడిలో చండశాసనుడి అంశ కొంచెం ఉంది; ఆయన్ని కలుసుకోడానికి ముందుగా అనుమతి తీసుకున్నావా, లేదా అని అడిగాడు. అతగాడు నన్ను బయటికి నెట్టేసే ప్రమాదం తప్పించడానికా అన్నట్టు, అతని గురువుగారే సరిగా సమయానికి అక్కడికి వచ్చారు.

“ముకుందుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రానియ్యి.” సాధువు కళ్ళు మెరిశాయి. “నా ఏకాంతవాస నియమం నా సౌకర్యం కోసం ఏర్పాటుచేసుకున్నది కాదు. లౌకిక జీవులకు, తమకున్న భ్రమల్ని పటాపంచలు చేసే నిష్కాపట్యం నచ్చదు. సాధువులన్న వాళ్ళు చాలా అరుదుగా ఉండడమే కాదు, వాళ్ళు సరిగా అర్థం కావడం కూడా కష్టం. పవిత్ర గ్రంథాల్లో కూడా వాళ్ళ గురించి రాసింది తరచు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది!”

నేను భాదురీ మహాశయుల వెనక, పై అంతస్తులో ఉన్న ఆయన నివాస భాగానికి వెళ్ళాను. అది ఎంతో నిరాడంబరంగా ఉంది. ఆయన అక్కణ్ణించి కదలడమన్నది చాలా అరుదు. సాధుపుంగవులు తరచుగా ప్రాపంచిక కార్యకలాపాల్ని పట్టించుకోరు; యుగ ప్రసిద్ధులు అయేవరకు వెలుగులోకి రారు. ఒక మునికి, సంకుచితమైన వర్తమాన కాలంలో జీవించే వాళ్ళు మాత్రమే సమకాలికులని అనుకోడానికి వీలులేదు.

“మహా ఋషీ[1], నేను ఎరిగినవాళ్ళలో, ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మొట్టమొదటి యోగి మీరేనండి.”

  1. “గొప్ప ముని.”