ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశయాలూ ఆదర్శాలూ

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

వ్యవస్థాపకులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు

అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాత

దేవుడితో వై యక్తికమయిన అపరోక్షానుభూతి సాధించడానికి తోడ్పడే నిర్దిష్ట శాస్త్రీయ ప్రక్రియల పరిజ్ఞానాన్ని అన్ని దేశాల్లోనూ వ్యాప్తి చేయడం.

జీవితానికి ప్రయోజనం, మానవుడి పరిమిత మర్త్యచేతనను దైవ చేతనగా స్వయంకృషితో పరిణామం చెందేటట్లు చేయడమేనని బోధించడం.

ఏసుక్రీస్తు బోధించిన మూల క్రైస్తవంలోనూ శ్రీకృష్ణ భగవానుడు బోధించిన మూల యోగంలోనూ సంపూర్ణ సామరస్యం, మౌలికమయిన ఏకత్వం ఉన్నాయని వెల్లడించడం ; ఈ సత్యసూత్రాలు వాస్తవ మతా లన్నింటికీ సమానమయిన శాస్త్రీయ ప్రాతిపదికలని నిరూపించడం,

నిజమయిన మతవిశ్వాస మార్గాలన్నీ. నిర్దేశించే ఏకైక దేవరాజు మార్గాన్ని చూపించడం ; ప్రతి నిత్యం శాస్త్రీయమయిన పద్ధతిలో, భక్తి పూర్వకంగా చేసే భగవధ్యానమే ఆ రాజమార్గం.

శారీరక వ్యాధి, మానసిక వైకల్యాలు, ఆధ్యాత్మిక జ్ఞానరాహిత్యం అనే మూడు రకాల బాధలనుంచి మానవుణ్ణి విముక్తుణ్ణి చేయడం.

“నిరాడంబర జీవనం, ఉన్నత భావనం" ప్రోత్సహించడం ;