ఈ పుట ఆమోదించబడ్డది

టైగర్ స్వామి

97

ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను. కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తరవాత, యువరాజు ఉద్దేశం బయటపడింది.

“ ‘మీరు ఉత్తి చేతులతోనే అడవి పులులతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది. ఇది నిజమేనా?’ ”

“ ‘అక్షరాలా నిజం.’ ”

“ ‘నేను నమ్మలేను! పట్నవాసుల తెల్ల బియ్యపన్నం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు. నిజం చెప్పండి; మీరు పోట్లాడేది, వెన్నుబలం లేని, నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ?’ ఆయన గొంతు బిగ్గరగా, వెటకారంగా ఉంది; పలుకుబడిలో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది.

“నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు.

“ ‘మాకు కొత్తగా పట్టుబడ్డ ‘రాజా-బేగం’[1] అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. మీరు దాన్ని సరిగా ఎదిరించి, గొలుసుతో కట్టేసి, ఒంటిమీద స్పృహ పోకుండా దాని బోనులోంచి బయటికి రాగలిగితే, ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు. అంతేకాక, అనేక వేల రూపాయలు, అనేక ఇతర బహుమతులూ కూడా వస్తాయి. ఒకవేళ మీరు, దాన్ని ఎదుర్కోడానికి ఒప్పుకోకపోతే, మీరు వట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను!’

“అవమానకరమైన ఆయన మాటలు తుపాకిగుండ్ల వర్షంలా తగిలాయి. నేనూ కోపంగానే అంగీకారం తెలిపాను. ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి, ఒక విషపు నవ్వు నవ్వుతూ మళ్ళీ కుర్చీలో

  1. ‘‘రాజా - బేగం” - ఆడపులికి, మగపులికి కలిపి ఉండేటంత ఉగ్రత దీనికి ఉందని సూచించడానికి ఈ పేరు పెట్టారు.