ఈ పుట ఆమోదించబడ్డది

“గంధబాబా” అద్భుతాల ప్రదర్శన

87

కూడిన కోరికలు, ఆశయాలు); నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇవ్వడం, ఆపదలు పిడుగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడూ చలించక పోవడం!”

కాశీఘాట్ గుడిదగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన మునికాని, టిబెట్టులో శిక్షణపొందిన యోగికాని, గురువుకోసం నాకుగల ఆకాంక్షను తీర్చలేదు. నా హృదయానికి, ప్రేరణలకోసం, అధ్యాపకుడు అవసరం లేకపోయింది; “ధైర్యం వహించు!” అంటూ దానంతట అది కేక వేసింది. అది అరుదుగా నిశ్శబ్దంలోంచి వెలువడేది కావడంవల్ల గట్టిగా మారుమోగింది. చివరికి నేను మా గురువుగారిని కలుసుకున్నప్పుడు, ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయతవల్ల నే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు.