ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవితంలోనూ మరణంలోనూ కూడా యోగి

పరమహంస యోగానందగారు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజిలస్ నగరంలో, 1952 మార్చి 7 తేదీన, భారత రాయబారి మాన్య శ్రీ బినయ్. ఆర్. సేన్‌గారి గౌరవార్థం జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసిన తరవాత 'మహాసమాధి' (యోగి చివరిసారిగా, సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం) చెందారు.

ఈ జగద్గురువులు యోగవిద్యను (దైవసాక్షాత్కారానికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియలు) జీవితంలోనే కాకుండా మరణంలో కూడా ప్రదర్శించారు. ఆయన చనిపోయిన కొన్ని వారాల తరవాత కూడా ఆయన ముఖం అమరత్వమనే దివ్యతేజస్సుతో ప్రకాశించింది.

లాస్ ఏంజిలస్‌లోవి ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్ మార్చువరీ (శవాల్ని భద్రపరిచే చోటు; ఇక్కడ మహాగురువుల భౌతికకాయాన్ని తాత్కాలికంగా ఉంచటం జరిగింది) డై కక్టరు శ్రీ హరీ టి. రోవే, సెల్ఫ్ రియలై జేషన్ ఫెలోషిప్ సంస్థకు రాసిన ప్రమాణిత పత్రంలోని కొన్ని భాగాలు కింద పొందుపరుస్తున్నాం:

“పరమహంస యోగానందగారి మృతదేహం మీద కంటికి కనబడే క్షయత్వ చిహ్నాలేవీ లేకపోవడం, మా అనుభవంలో అత్యంత ఆసాధారణ మైన విషయం... చనిపోయిన ఇరవై రోజుల తరవాత కూడా ఆయన భౌతికకాయంలో శారీరక విఘటనం కనబడలేదు. . . ఆయన చర్మంమీద బూజుపట్టిన దాఖలా ఏమీ కనిపించలేదు ; ఆయన శరీర కణజాలాలు (టిస్యూస్) ఎండిపోవడం ఏమీ గోచరించలేదు. ఇంత పరిపూర్ణమైన శరీర