ఈ పుట ఆమోదించబడ్డది

రెండుసార్లు బోధింపగా చాలమంది ప్రభువుని అంగీకరించారు. కాని యూదులు అసూయతో పౌలు బర్నబాలపై గలాటా లేవదీశారు. స్థానికులను వారిపై పురికొల్పారు. పౌలు మీరు క్రీస్తుని నిరాకరించారు కనుక మేము అన్యజాతి వారి దగ్గరికి వెళ్తామని చెప్పారు. గ్రీకు ప్రజలు చాలమంది క్రీస్తుని అంగీకరించారు.

పౌలు బర్నబాలు అక్కడి నుండి ఇకోనియాకు వెళ్లారు. అక్కడకొందరు పౌలు బోధలు విని క్రీస్తుని విశ్వసించారు. కాని అక్కడకూడ యూదులు అసూయచెంది గలాటా లేవదీసారు. కనుక ఆ బోధకులు ఆ మండలంలోని లుస్రకు వెళ్లారు. పౌలు అక్కడ ఓకుంటివానికి నడచే శక్తినిచ్చాడు. కనుక ఆ నగరవాసులు దేవతలు ఈ నరుల రూపంలో దిగివచ్చారని ప్రశంసించారు. ఆ పట్టణ పూజారి దేవతలకులాగ వారికి සඹී సమర్పించడానికి కూడ పూనుకొన్నాడు. కాని ఆ బోధకులు అతన్ని వారించారు. అంతియొకయ ఇకోనియాలనుండి వచ్చిన యూదులు లుస్రలోని జనాన్ని తమవైపు త్రిప్పకొని పౌలుని రాళ్లతో కొట్టారు. అతడు మరణించాడు అనుకొని పట్టణం వెలుపలికి ఈడ్చివేశారు. పౌలు మరునాడు దెర్బెకు వెళ్లి అక్కడ బోధ చేశాడు. అటుపిమ్మట ఆ బోధకులు తిరిగి తాము పూర్వం బోధ చేసిన నగరాలను సందర్శించి అచటి విశ్వాసులను ప్రోత్సహించారు. మనం ప్రభువు సేవలో చాల శ్రమలు అనుభవించాలని చెప్పారు. క్రైస్తవ సంఘూలకు పెద్దలను నియమించారు. ఆ పిమ్మట సిరియాలోని అంతియొకయకు తిరిగివచ్చి తమ ప్రేషిత సేవను అక్కడి పెద్దలకు వివరించి చెప్పారు. అన్యజాతి వారు క్రీస్తుని అంగీకరించిన రీతిని తెలియజేశారు. ఈ యాత్ర క్రీ.శ. 45-48లో జరిగింది.


104. యెరూషలేము మహాసభ - అచ 15

యూదియ నుండి కొందరు బోధకులు అంతియోకయకు వచ్చి