ఈ పుట ఆమోదించబడ్డది

హింసిస్తున్నావు అని ప్రశ్నించాడు. నీవెవరివి అని సౌలు అడగ్గా ప్రభువు నేను యేసుని. నగరంలో నీకు అన్ని విషయాలు తెలుస్తాయిఅని చెప్పాడు. ఆ వెల్లురు సౌలుని గ్రుడ్డివాడ్డీ, బలహీనుణ్ణి చేసింది. మూడు రోజుల దాక అతనికి కంటి చూపులేదు, అన్న పానీయాలు ముట్టలేదు.

అననీయ అనే భక్తుడు డమస్కులోని క్రైస్తవులకు పెద్ద ప్రభువు అతనికి దర్శనమిచ్చి నీవు సౌలుదగ్గరికి వెళ్లమని ఆదేశించాడు. కాని అననీయ భయపడి ప్రభూ! అతడు మనకు విరోధి. యెరూషలేములోని క్రైస్తవులను హింసించి, ఇప్పుడు ఇక్కడి విశ్వాసులకుకూడ కీడు చేయడానికి వచ్చాడు కదా అని ప్రశ్నించాడు. ప్రభువు నీవు భయపడకు. ఇప్పడు సౌలు మారిపోయాడు. అతడు యిస్రాయేలు ప్రజలకు, అధికారులకు, అన్యులకు నన్ను తెలియజేస్తాడు. నా సేవలో చాలాశ్రమలు కూడ అనుభవిస్తాడు. నీవు అతని దగ్గరికి వెళ్లు అని చెప్పాడు.

అననీయ సౌలు దగ్గరికి వచ్చి అతని మీద చేతులు చాపగా అతనికి మరల చూపు వచ్చింది. అతడు అననీయ నుండి జ్ఞానస్నానం పొంది ఆహారం పుచ్చుకొన్నాడు. ఈ దర్శనం వలన క్రైస్తవులను నాశం చేయబూనిన సౌలు మార్పుచెంది క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేయడానికి పూనుకొన్నాడు. క్రీస్తు విరోధి క్రీస్తు భక్తుడయ్యాడు.


99. గంపలో సౌలు -అచ 9,20-30

సౌలు డమస్కు పట్టణంలో యేసే మెస్సియా అని బోధించాడు. ఇన్నాళ్లు క్రీస్తుని వ్యతిరేకించిన సౌలు ఇప్పుడు క్రీస్తే మెస్సియా అని వాదించడం చూచి యూదులు విస్తుపోయారు. అతన్ని చంపివేయడానికి పథకం పన్నారు. కాని సౌలు శిష్యులు అతన్ని గంపలోకూర్చొబెట్టి గోడమీదిగా అవతలి వైపుకు దింపివేశారు. ఈ రీతిగా తప్పించుకొని అతడు యెరూషలేము చేరాడు. కాని అక్కడి శిష్యులు మొదట సౌలుని నమ్మలేదు. ఐతే బర్నబా సౌలుని అపోస్తలుల దగ్గరికి తీసుకొనిపోయి