ఈ పుట ఆమోదించబడ్డది

అని చెప్పకొంటున్నాడు అని చెప్పారు. పిలాతు నీవు యూదుల రాజువా అని క్రీస్తుని అడిగాడు. ప్రభువు నీవే చెప్తున్నావు అని బదులు పల్మాడు. పిలాతు నాకు ఇతనిలో ఏ నేరం కన్పించలేదు అన్నాడు. యూదులు ఇతడు గలిలయనుండి యూదియా వరకు విప్లవం లేవదీస్తున్నాడు అని చెప్పారు. పిలాతు క్రీస్తుని వదలించుకోగోరి అతన్ని గలిలయ పాలకుడైన హేరోదు దగ్గరికి పంపాడు. ఈ హేరోదు క్రీస్తు అద్భుతాలు చూడాలని కోరికతో వున్నాడు. కాని క్రీస్తు అతనితో మాటలాడక మౌనంగా వుండి పోయాడు. కనుక అతడు క్రీస్తుని మళ్లా పిలాతు దగ్గరికే పంపాడు. పాస్క ఉత్సవంలో ఒక బందీని విడుదలచేసే ఆచారం వుంది. అప్పడు బరబ్బ అనే బందిపోటు దొంగ చెరలో వున్నాడు. పిలాతు పండుగ సందర్భంలో క్రీస్తుని విడుదలచేయగోరాడు. కాని యూదులు మాకు బరబ్బను విడుదల చేయమని అరచారు. క్రీస్తుని సిలువవేయమని కేకలువేశారు. పిలాతుకి క్రీస్తునిర్దోషి అని తెలుసు. కాని అతన్ని విడుదల చేస్తే ప్రజలు తిరగబడతారనీ, తన పదవికే గండం వస్తుందనీ దడిశాడు. కనుక క్రీస్తుని మొదట కొరడాలతో కొట్టించి అటుపిమ్మట సిలువ వేయడానికి అనుమతినిచ్చాడు. యూద సైనికులు క్రీస్తుని తీసికొనిపోయి ఎర్రని అంగీని తొడిగారు. ముళ్ల కిరీటం అల్లి అతని తలమీద పెట్టారు. కుడి చేతిలో వెదురు కర్రను పెట్టారు. అతని ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు నమస్కారం అని హేళన చేశారు. అతని మీద ఉమ్మి వేశారు. తలపై మోదారు. అతన్ని సిలువ వేయడానికి తీసికొని పోయారు.

79. యేసు సిలువను మోయడం -మత్త 27,32–42

యేసు సిలువను మోసికొని కపాలకొండకు నడచిపోయాడు. నల్లురు రోమను సైనికులు అతన్ని నడిపించుకొని పోయారు. అతనితో పాటు ఇద్దరు దొంగలను కూడ సిలువ వేశారు. ప్రభువు కొరడా