ఈ పుట ఆమోదించబడ్డది

అనుకొన్నారు. ప్రధానార్చకుడైన కయిఫా మన జాతి అంతా నాశం గావడంకంటే ఒక్కడు దాని తరఫున మరణించడం మేలు అన్నాడు. క్రీస్తు మరణాన్ని ఉద్దేశించే అతడు ఈలా పల్మాడు. కాని ప్రభువు ఒక్క యూదజాతి కొరకు మాత్రమే కాక దేవుని బిడ్డలందరి కొరకు మరణిస్తాడు.

62. మరియ క్రీస్తుకి అభిషేకం చేయడం - యోహా 12,1-11

బెతినియాలో క్రీస్తుకి విందు చేశారు. క్రీస్తుతోపాటు చనిపోయి లేచిన లాజరు కూడ ఆ విందులో పాల్గొన్నాడు. మరియ పరిమళద్రవ్యం తెచ్చి భక్తిభావంతో యేసు పాదాలకు పూసి వాటిని తలవెండ్రుకలతో తుడిచింది. యూదా యిస్కారియోతు దీన్ని మూడు వందల దీనారాలకు అమ్మి ఆ సొమ్ముతో పేదలకు దానం చేయవచ్చు గదా అన్నాడు. అతనికి పేదలపట్ల జాలి యేమీ లేదు. శిష్యుల ఉమ్మడి సొమ్ము అతని దగ్గర వుండేది. దానినుండి అతడు కొంత కాజేస్తుండే వాడు. ఇప్పడీ సొమ్ము నుండి గూడ తన వాటా కొట్టేయవచ్చు గదా అని అతని ఉద్దేశం. కాని ప్రభువు మరియు కోపు తీసికొన్నాడు. ఆమెను ఈ సుగంధద్రవ్యం పూయనీయండి. నా భూస్థాపనాన్ని సూచిస్తూ ఆమె ఈ కార్యం చేసింది. పేదలు ఎప్పడూ వుంటారు. వారికి మీరు ఎప్పడైన సహాయం చేయవచ్చు. నేను ఎల్లప్పడు మీతో వుండను గదా అన్నాడు. అప్పటికే యూద నాయకులు క్రీస్తునీ లాజరునీ చంపాలని ఆలోచిస్తూన్నారు. కనుక మరియ క్రీస్తు భూస్థాపనాన్ని ముందుగానే పసిగట్టి ఈ కార్యం చేసింది.

63. క్రీస్తు యెరూషలేము ప్రవేశించడం - మత్త 21,1-11

యేసు శిష్యులను పిలచి బెత్ఫగే గ్రామంలోని గాడిదనూ దాని పిల్లనూ తోలుకొని రమ్మన్నాడు. శిష్యులు ఆలాగే చేసి గాడిదపై బట్టలు కప్పారు. యేసు దానిపై కూర్చుండి యెరూషలేము ప్రవేశించాడు. పభువుని చూడ్డానికి చాలమంది జనం ప్రోగయ్యారు . కొందరు దారి