ఈ పుట ఆమోదించబడ్డది

శక్తులు దాన్ని జయించలేవు. నా సమాజం మీద నీకు సర్వాధికారం వుంటుంది అని చెప్పాడు. క్రీస్తు చెప్పినట్లే పేతురు అతని సమాజానికి ప్రధానాధికారి అయ్యాడు.

41. దివ్యరూప ధారణం - మత్త 17,1-8


యేసు ముగ్గురు శిష్యులతో కొండమీదికి వెళ్లి మారు రూపం పొందాడు. అతని ముఖం సూర్యునిలా ప్రకాశించింది. దుస్తులు తళతళ మెరిశాయి. మోషే యేలీయాలు కన్పించి అతనితో మాటలాడారు. పేతురు ఆదర్శనం వల్ల ఉత్తేజితుడై ప్రభూ! మనం ఇక్కడే వుండిపోతే బాగుంటుంది. నేను మీ ముగ్గురికి మూడు గుడారాలు నిర్మిస్తాను అని పల్మాడు. అప్పడు మేఘం నుండి తండ్రి ఇతడు నాకు ఇష్టుడైన కుమారుడు. ఇతని వలన నాకు సంతోషం కలిగింది. మీరు ఇతని బోధ వినండి అని పల్కాడు. ఆ స్వరానికి శిష్యులు భయపడి బోరగిలబడ్డారు. యేసు వారికి అభయమిచ్చాడు.

42. చేపనోటిలో నాణెం -మత్త 17,24-27


గుడిపన్ను వసూలు చేసేవాళ్లు మీ గురువు పన్ను చెల్లించాలి కదా అని పేతురుని అడిగారు. యేసు పేతురుతో దేవుని కుమారుడు పన్ను చెల్లించ నక్కరలేదు. ఐనా మనం వీరికి చెడ్డ ఆదర్శం చూపించకూడదు. నీవు సరస్సుకి వెళ్లి గాలం వేయి. నీకు మొదట చిక్కిన చేపనోటిలో నాణెం దొరుకుతుంది. దాన్ని పన్నుగా చెల్లించు అని చెప్పాడు. శిష్యుడు ప్రభువు చెప్పినట్లే చేశాడు.


43. ఎవడు గొప్పవాడు? -మత్త 18, 1-5

శిష్యులు లోక వ్యామోహంలో పడిపోయి పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు అని గురువుని అడిగారు. ప్రభువు మీరు చిన్న బిడ్డల్లా ఐతేనే తప్ప పరలోక రాజ్యంలో చేరలేరని చెప్పాడు. వాళ్లు త్రోవలో మనలో గొప్పవాడు ఎవడని వాదించుకొన్నారు. క్రీస్తువారికి ఓ చిన్న బిడ్డణ్ణి ఆదర్శంగా చూపి మీరు వీడిలా మారాలని చెప్పాడు. శిష్యులు