ఈ పుట ఆమోదించబడ్డది

పాతుకోలేదు. సూర్యుని వేడిమికి ఎండిపోయాయి. జీవితంలో ఇబ్బందులు హింసలు ఎదురైనపుడు కొందరిలో వాక్యం అనే మొలకలు ఎండిపోతాయి.

మరికొన్ని విత్తనాలు ముండ్లనేలలో పడ్డాయి. ముండ్లపొదలు ఆ మొలకలను అణిచి వేశాయి. లోకవ్యామోహాల్లో చిక్కుకొన్నవారిలో వాక్యం ఫలించదు.

వేరు కొన్ని సారవంతమైన నేలపై బడి నూరంతలు, అరువదంతలు ముప్పదంతలు పంటనిచ్చాయి. కొందరిలో దేవుని వాక్కుమంచి ఫలితాన్ని ఇస్తుంది.

విత్తనం ప్రభువు వాక్కే నాలు రకాల నేలలు మన హృదయాలే. హృదయం భక్తివిశ్వాసాలు కలదై సారవంతమైన నేలలా వుంటే దానిలో పడిన దైవవాక్కు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

31. గోదుమపైరు, కలుపు మొక్కలు - మత్త 13

ఓ రైతు పొలంలో గోదుమగింజలు చల్లాడు. కాని అతని శత్రువు వచ్చి ఆ పొలంలో కలుపు గింజలు చల్లిపోయాడు. గోదుమపైరుతో పాటు కలుపుమొక్కలు కూడ పెరిగాయి. జీతగాళ్లు రైతుని కలుపుమొక్కలు పెరికి వేయమంటావా అని అడిగారు. రైతు వద్దు. వాటిని లాగినప్పుడు గోదుమ మొక్కలు కూడ వూడి వస్తాయి. కోతకాలంలో ముందుగా కలుపుని పెరికివేసి అగ్నిలో కాల్చి వేయవచ్చు. గోదుమలను ఇంటికి తెచ్చుకోవచ్చు అని చెప్పాడు.

ఇక్కడ పొలంలో గోదుమలు చల్లినవాడు క్రీస్తే గోదుమపైరు భక్తిగల నరులను సూచిస్తుంది. కలుపు గింజలు చల్లినవాడు పిశాచం. ఈ కలుపు భక్తి విశ్వాసాలు లేని దుష్టులను సూచిస్తుంది. న్యాయ నిర్ణయ దినాన వీరికి శిక్ష పడుతుంది.

32. తుఫానుని ఆపడం -మత్త 8,23-27

ఒకసారి యేసూ శిష్యులూ పడవలో ప్రయాణం చేస్తూండగా పెద్ద