ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాత ప్రభువు దేవాలయంలో అతన్ని చూచి నీకు ఆరోగ్యం కలిగింది కదా! ఇక పాపం చేయకు. చేశావో మరింత కీడు చుట్టు కొంటుంది సుమా అని చెప్పాడు. అతడు వెళ్లి తనకు వ్యాధి నయం జేసినవాడు యేసని నాయకులకు తెలియజేశాడు. విశ్రాంతి దినాన ఆరోగ్యాన్ని చేకూర్చి పడక మోయడమనే పని చేయించినందుకు యూదులు క్రీస్తుపై ఆగ్రహం చెంది అతన్ని బాధించడం మొదలు పెట్టారు. వాళ్లు రోగి ఆరోగ్యాన్ని పొందినందుకు సంతోషించలేదు. అతడు విశ్రాంతి దినాన పడక మోసి నందుకు కోపించారు.


29. మత్తయికి పిలుపు - మత్త 9,9-13

యేసు గలిలయ సరస్సు ప్రక్కన నడుస్తూ సుంకాల శాలలో సుంకాలు వసూలు చేసే మత్తయిని చూచి నీవు నన్ను అనుసరించు అని చెప్పాడు. మత్తయి తన ఉద్యోగాన్నీ డబ్బునీ వదలిపెట్టి క్రీస్తు వెంట పోయాడు. తర్వాత అతడు ప్రభువుకి పెద్ద విందు చేశాడు. ఆ విందుకి చాలమంది సుంకరులు వచ్చారు. పరిసయులు సుంకరులను అసహ్యించుకొనే వాళ్లు. క్రీస్తు వారితో కలసి భోజనం చేయడం నచ్చనందున వాళ్లు అతనిపై గొణిగారు. ప్రభువు నేను వ్యాధిగ్రస్తుల కొరకు వచ్చిన వైద్యుణ్ణి. నేను పాపుల కొరకు వచ్చాను గాని పుణ్యాత్ముల కొరకు కాదు అని జవాబు చెప్పాడు. అతనికి పాపులమీద కరుణ మిక్కుటంగా వుండేది.


30. విత్తేవాని ఉపమానం - మత్త 13,4-22

ఓ రైతు పొలంలో విత్తనాలు వెదజల్లుతూండగా కొన్ని విత్తనాలు త్రోవ నేలలో పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. కొందరు అసలు వాక్యం భావాన్ని అర్థం చేసికొనే ప్రయత్నమే చేయరు. పిశాచం వచ్చి వారి హృదయంలో పడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. ఇంకా కొన్ని విత్తనాలు రాతినేలపై బడ్డాయి. అవి వేరు