ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరంతు శ్రుతి సామాన్యమాత్రమ్ (1-1-31) ప్రవాహణియని యనుదానికి సమాధానము చెప్పఁబడుచున్నది. ప్రవాహణుఁ డనునొకపురుషుఁ డున్న యెడల వానియపత్యము ప్రావాహణి యని సిద్ధించును. ఆ పేరుగల పురుషుఁడే లేఁడు. "ప్ర" అనుదానికిఁ బ్రకర్ష మనియర్ధము. "వహ్" ధాతువునకు "పొందించుట" అని యర్ధము. హెచ్చుగా మోయు వాఁడని దీని సముదాయార్దము. ఇకాాాారము "మారుతి, రావణిన" ఇత్యాద్యపత్యార్ధమందు సిద్దించినట్లిచటఁ గ్రియకుఁ గర్త్రర్ధమందు సిద్ధించినది. కావున నెవఁడు విస్తారముగా మోయువాఁడో వాఁడు ప్రావాహణి యనంబడును. బబర యనునది యనుకరణశబ్దము. అందువలన నెద్ది నిత్యమగు నర్ధమో దానినే యీ బబర ప్రవాహాణినశబ్దములు తెలుపుచున్నవి.

కృతేవా వినియోగస్యాత్కర్మణ స్సంబంధాత్ (1-1-82) ఈ వేదము వెఱ్ఱి వానిమాటవంటిది కాదని మన మెట్లు తలంపఁగలము, ఏమనఁగా- “వనస్పతయ స్సత్రమాసత” (వృక్షములు సత్రయాగము నొనర్చెను) “సర్పాస్సత్రమాసత” (సర్పములు సత్రయాగమును జేసెను.) “జరద్గవో గాయతి మత్తకాని” (ముసలియెద్దు పాటలు పొడుచున్నది) ఇది యంతయు ననుపపన్నముగా నున్నట్లు తోఁచుచున్నది. అను పూర్వపక్షము రాఁగా సమాధానము, ఇది యనుపపన్న మైనయెడల "అగ్నిహోత్రం జుహు యాత్స్వగ౯కామః " అనువాక్యములు కూడ ననుపపన్న ములు కావలసివచ్చును. “వనస్పతయ స్సత్ర మాసత” ఇత్యాది వాక్యము లనుపపన్నములు కావు. ఇవి సత్రయాగమును స్తుతించువాక్యములు. అచేతనము లగు వృక్షములే సత్రయాగ మొనరించినపుడు విద్వాంసులగు బ్రాహ్మణులు దీని ననుష్ఠింపవలయు నని చెప్పెడిదేమి ? ఇట్లు వేదభాష్యకర్త యగు విద్యారణ్యుఁడు ఋగ్వేద భాష్యోపోద్ఘాతమందీ వేదమునుగుఱించి నానావిధపూర్వపక్షములనుజేసి వానికి విపులముగా సమాధానములను జెప్పెను. వాని సన్నింటి నిచట వ్రాసినచో గ్రంథ విస్తర మగు నని వరమించితిని.

నిఘంటుశబ్దవ్యుత్పత్తి.

"తే నిగనవఏవవ సఁతో నిగమనా న్నిఘణ్ణవ ఉచ్యఁ త ఇత్యౌపమన్యవఃః" ఉదాహృతా స్సమామ్నాతా నిర్వచన ప్రసఁగతో నిరుచ్యంతే | యఏతే సమామ్నాతాగవాదయస్తఏతే మంత్రాధ౯క నిగమయితృత్వాన్నిగన్తవ