ఈ పుట ఆమోదించబడ్డది

x


దూరంలో ఉన్న జానపాడు అనే ఊళ్ళో సంస్కృత భాషాభ్యాసం చేశారు. శిష్ట్లా సీతారామశాస్త్రి గారు వీరి గురువుగారు ప్రస్తుత గ్రంథంలొ మొదటి శ్లోకంలో వారి ప్రస్తావన ఉంది. పదిహెను పదహారేళ్ళ వయసులో గుంటూరు లూధరన్ మిషన్ వారి హైస్కూలులో ఇంగ్లీషు చదువులు చదివారు మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లో ఈయన శతావధానం చేశారు. బెజవాడలో కన్యకాపరమేశ్వరి హిందూ పాఠశాలలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. 1912 లో తెరచిన ఆంధ్రసాహిత్యపరిషత్తు మద్రాసు కార్యాలయంలో జయంతి రామయ్యగారి ఆహ్వనంపై కొన్నాళ్ళు మేనేజరుగా పనిచేశారు. వేషధారణపై వచ్చిన పేచీ వల్ల ఉమాకాంతంగారు ఉద్యొగం మానేసినట్లు రమాపతిరావుగారు పైన పేర్కొన్న వ్యాసంలో రాశారు. ఈయన బెంగాల్‌లో నవద్వీప సంప్రదాయాన్ననుసరించి భాష్యాంతముగా సంస్కృత వ్యాకరణమూ తర్కశాస్త్రమూ, అభ్యసించి 'విద్యాశేఖరు' లైనా రని అబ్బూరి రామకృష్ణరావుగారు రాశారు. "తమ తర్క వ్యాకరణ విద్యా వ్యాసంగాన్ని వంగ దేశంలో జరుపుతూ వచ్చారు. వంగ సాహిత్యవేత్తలతో సాహచర్యం వల్లా లోకజ్ఞానం వల్లా స్వానుభవం వల్లా వంగసాహిత్యాభ్యుదయానికి గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వల్లా తమకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసికొని తమ మాతృభాష అయిన తెనుగును పరామర్శించడం ఆరంభించారు" అని అన్నారాయన ఆయన వావిలి కొలను సుబ్బారావుగారి తరవాత (1929లో) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా పనిఛేశారు. 1913-1914 మధ్య కాలంలో త్రిలిఙ్గ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. 'త్రిలిఙ్గ' అనే పేరు ఆయన పెట్టిందేనని త్రిలిఙ్గ రజతోత్సవ సంచిక (1941)కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశంలో ఇంగ్లీషులో కామెంటు (Comment) అనే మాటకు పర్యాయంగా వ్యాఖ్యా శబ్దాన్ని పరీక్ష పత్రాల్లో తానే మొదట వాడినట్లు పేర్కొన్నారు.

1913-1914 సంవత్సరాల మధ్యలో ఆయన త్రిలిఙ్గ పత్రికలో కధలు రాశారు 1918 లో ఇవి త్రిలిఙ్గ చిన్నకధలు పేరుతో సంకలితం