ఈ పుట ఆమోదించబడ్డది

నిదర్శనాధికరణం

51

శాస్త్రాల్లో విషయం స్ఫుటపరచడానికి ఆవశ్యకత వస్తుంది. వాక్యపదీయకారుడు ద్వితీయకాండంలో

"ప్రమాణత్వేన తాం లోకః సర్వః సమనువశ్యతి,
 సమారంభాః ప్రతీయన్తేతిరశ్చామపి తద్వశాత్." (వాక్య)

(ఆప్రతిభయే ప్రమాణంగా లోకం చూస్తున్నది. ఆప్రతిభావశోననే తిర్యక్కులకుగూడా ప్రవృత్తిప్రతీతమవుతున్నది.} అని ప్రతిభను ప్రతిపాదించి

"స్వరప్రవృత్తిం వికురుతే,
 మధౌ పుంస్కోకిలస్యకః" (వాక్య)

(మధుమాసంలో కోకిలకు పంచమస్వరవిరావం యెవడు కలిగిస్తున్నాడు? ప్రతిభయే.)

అని నిదర్శనం చెప్పుతాడు. కాని శాస్త్రం గనుక .యింకాస్ఫుట పడడానికి,

"జంత్వాదయః కులాయాదికరణే కేన శిక్షితాః,
 ఆహార ప్రీత్యభిద్వేష ప్లవనాదిక్రియాసు కః.
 జాత్యన్వయప్రసిద్దాసు ప్రయోక్తా మృగపక్షిణాం." (వాక్య)

(సాలీడు మొదలైనవాటికి గూళ్లు నిర్మించడం యెవరునేర్పినారు? ఆహారం, ప్రీతి, ద్వేషం, యీదడం మొదలయిన జాత్యన్వయ ప్రసిద్దక్రియలలో మృగపక్షులను యెవడు నడిపేవాడు) అని నిరూపిస్తాడు. అనాది ప్రతిభావశంవల్ల ఈక్రియలు ప్రేరితమై ప్రతీతమవుతున్న వని వీటికి జన్మాంతరంలో శబ్దశ్రవణం బోధహేతువని శ్రుతాశ్రుతశబ్దాలే సర్వప్రవృత్తికి హేతువని యిట్లా శబ్దంవల్ల కలిగే యితికర్తవ్య తారూపమైనదే. వాక్యార్థ మని అదే భగవతి ప్రతిభ అని ఆపంక్తుల అభిప్రాయం. శాస్త్రం గనుక మూడునిదర్శనాలు చెప్పి అభిప్రాయం స్ఫుటపరచాడు. ఇట్లానే సర్వం స్వభావంచేతనే ప్రవృత్తమవుతున్నది గాని వేరే నియంత లేడనే చార్వాకసిద్ధాంతం మాధవాచార్యులవారు సర్వదర్శనసంగ్రహంలో ప్రతిపాదిస్తూ ఉదాహరించిన అభియుక్తోక్తి, అభిప్రాయం స్ఫుట పరచడానికి,