ఈ పుట ఆమోదించబడ్డది

38

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


వెనుకటి నాటకాల్లో వున్నా అది దోషమేగాని గుణంకాదు. కాళిదాసువంటి కవియొక్క కృతిలో ఇది కనబడితే దాన్ని దోషమనే మమ్మటుడు నిరాకరించాడు. అది కుమారసంభవంలోని రతీవిలాపం. అది ఉండవలసినదానికంటె హెచ్చుగా వుంటుంది. శాకుంతలంలో తృతీయాంక ప్రారంభంలో రాజు కొంచెం దీర్ఘంగా ప్రసంగించినట్లుంటుంది.

"ముద్రారాక్ష సాద్యసత్ కావ్యవిషయత్వాత్" (అహో) అని అహోబలుడు నిరాకరించిన ముద్రారాక్షసంవంటి కేవలవ్యవహార నాటకాల్లో వుంటే అది అసత్కావ్యత్వాన్ని యింకా యెక్కువగా స్థిరపరుస్తుంది. ఇక వెనుకటినాటకాల్లో యెక్కడనైనావుంటే అది దోషమేగాని గుణంకాదు.

ఈకాలపుకృతుల్లో ఇది విస్తారంగా వున్నది. కృష్ణపక్షంలోని "ఆశ" మొదలైనవి సాహితిలోని "వియోగరాగము. ప్రబోధము" ఇవన్నీ యీదోషానికి ఉదాహరణలే అయివున్నవి. యెంకిపాటలవంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీకాలపుకృతుల్లో అనేకాల్లో యీదోషం కనబడుతున్నది.

అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో విస్తారాధికరణం సమాప్తం.