నూతనత్వాధికరణం
29
యేలయేలకిపొదలు వెదకెద వింత వింతలె యెందుజూచితి"
(వృషభగతిరగడ-వసు
అని యీతీరున దరువులు విరుపులు చిరకాలమునుండి వున్నవిగాని కొత్తవిగావు. వీటిలో ఉత్కళిక గురుజాడఅప్పారావు కన్యక అనే ఖండకావ్యపు వృత్తానికి మూలమనదగినది. వీరు కట్టుబాట్లు తెంపి కావ్యాలు వ్రాస్తున్నారు. అది కొత్త అంటారా? అదిగూడా నిల్వజాలదు. కట్టుబాటులో కవిత్వమా అనిచెప్పిన పీఠికాకర్త కృష్ణపక్షంలో వళులు, ప్రాసలు మొదలైన వాటికిందనే వున్నాడు.
........... | మాలికలంబ్రణయార్ద్ర | - |
........... | బూవుపూవునకు | - |
ఆకులో | నాకునై | (మురువుసూప) |
యదృశ్యమౌ | నిద్రవోవు | (కృష్ణపక్షం) |
అని యీతీరున నుగామం గజడదబల గసడదవల అదేశం, యడాగమం మొదలైనవన్నీ వెనుకటికావ్యాల్లో వలెనే వున్నవి. యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాట యిటువంటి కావ్యాల్లో భాష కొత్తది అంటారా అదీ సరిగాదు.
"యెట్లా పోనిస్తివోయి మట్లావోరి చిన్నదాన్ని"
"ఓరందకాడా బంగారుబావా"
అనే యిట్లాటి యాటపాటల్లో చిరకాలమునుండి యీభాష వుంటూనే వున్నది.
ఆక్షేపం.
అవునుగాని వీటిలో ఋతువర్ణనలు చంద్రోపాలంభాదులు మొదలైనవి లేవు గనక యీకలపు కవిత్వం కొత్త అంటాము అని వాదిస్తారా?
సమాధానం
చెప్పుతున్నాను మీమాట సరిగాదు. ఋతువర్ణనలు మొదలైనవి వుండడం లేకపొవడం కవిత్వానికి నూతనత్వ మాపాదించవు. సందర్భానికి వుచితంగా వుంటే అవి కావ్యానికి నూతనత్వ మాపాదించవు. సందర్భానికి