ఈ పుట ఆమోదించబడ్డది

క్షుద్రకావ్యాధికరణం

203


యివన్నీ ఒకటేరకం. చివరనాలుగు నీతిమాటలున్నా వీటికి గ్రాహ్యత్వం సమకూర్చవు. విషంమీద నాలుగు తేనెబొట్లు వేసినంతమాత్రాన విషానికి విషత్వంబోదు. పైగాతేనెగూడా విషసంపర్కంచేత కలుషితమవుతున్నది. కనకనే యివి హేయకోటిలో చేరుతున్నవంటున్నాను.

ఇక తక్కినవి చిల్లరపాత్రలశృంగారం గలవి యెంకిపాటలు మొదలైనవి క్షుద్రకావ్యాలన్నాను. వెంకయ్య చంద్రమ్మపాట, ఓరోరి బండోడిపాట మొదలైనవి యెంకిపాటల కోటిలోనివి. ఇవన్నీ ఈచిల్లర కావ్యాలే అయువున్నవి. ఈక్షుద్రకావ్యాలను యెంకిపాటలు మొదలైనవి మచ్చుగా విమర్శించాను ధర్మసంబంధం యెంకికి నాయుడుబావకు యెంకయ్యకు చంద్రమ్మకు వ్రాయక పోయినా ఉన్నదనుకోగూడదా అంటే అది అసంబద్ధం. వ్రాయకపోతే ఉన్నదని యెట్లా అనుకొనడం? అట్లయితే అసలు కావ్యం వ్రాయకుండానే వ్రాశాడను కోవచ్చు. కనుక అవి అసంబద్దపుమాట లంటున్నాను. యెంకినాయుడూ సంస్కారంలేని చిల్లరమనుషులని యింకా ముందు నిర్ణయించబోతున్నాను. యెంకమ్మ చంద్రమ్మపాట మొదలైనవి యెంకిపాటలు యిట్లానే సాధారణనాయకుల శృంగారంగల "చెన్నపట్టణంలో" వంటినవలలు, భారతి పత్రికలో ఆకోటిలోని "పరీక్ష" వంటి కథలు చిల్లరకావ్యాలని వ్యక్తపరచాను. భగవంతుడిమీద రతి శిశుప్రేమ ముగ్ధప్రకృతిప్రేమ, ఉత్తమూలభావ దశాశృంగారం వీటికన్నిటికీ భావధ్వని అని సాహిత్య సంప్రదాయంలో పేరు. భావకావ్యమని కూడా అనవచ్చును. ఈ భావకావ్యాలు ఖండాఖండభేదంతో (మహాకావ్యమని ఖండకావ్యమని భేదంతో) ఉదాత్తకావ్యకోటిలోనే భారతీయసంప్రదాయాన్ని అనుసరించి చేరుతున్నవి.

భారతిలోని వెంకటేశవచనాలు, కృష్ణకర్ణామృతం, సౌందర్యలహరి, ఋతుసంహారం, సూర్యశతకం మూకవిరచితమైన మూకపంచాశతి, ధూర్జటి కాళహస్తిశతకం. ఇవన్నీ భావకావ్యకోటిలోవి. నేటికాలపు