ఈ పుట ఆమోదించబడ్డది

140

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

దేవాదివిషయమైన రతికి భావమని పేరని మమ్మటాదులు తెలిపినారు. శిశుప్రేమను వత్సలరసమని కొందరన్నా అదే దర్పణవ్యాఖ్యాతకు యిష్టమైనా, శిశుప్రేమను సయితం భావంలోనే మరికొందరు చేరుస్తారు.

"ఆదీపదాత్ పుత్రాదేరపి గ్రహణం ఇత్యన్యే" (సాహి)

అని వ్యాఖ్యాత ఉదాహరించాడు.ఆది పదంవల్ల ప్రకృతి: ప్రేమ సయితం భావమే అవుతున్నదనవచ్చును. సౌందర్యలహరి,ఋతుసంహారం, మహిమ్నస్తోత్రం మొదలైనవి యీభావకోటిలోనె చేరుతున్నవి. శిశుక్రందీయమని

"శిశుక్రందయమసభద్వన్ద్వేన్ద్ర జననాదిభ్యశ్చః. (పాణి)

అనేసూత్రంవద్ద పాణిని ఒక గ్రంథం పేరు ఉదాహరించాడు కాని అది యెట్లాటిదో చెప్పలేము.శిశువు యేడుపునుగురించిన అది, భావకావ్యమే అయివుంటుం దని పేరునుబట్టి చెప్పవచ్చును. ప్రియుడికి ప్రియురాలికి గలప్రేమకుమాత్రం పరిపుష్టదశలో రసమని అపరిపుష్ట దశలో భావమని పేరుపెట్టినారు. ఇప్పటివారు ఆసంప్రదాయం తెలియక తమచిన్న కావ్యాల్లో స్త్రీపురుషులప్రేమ పరిపూర్ణమైనాగూడా దాన్ని భావమేనని పిలిస్తే అది మనసాహిత్యదోషంమాత్రం గాదని భారతీయవిజ్ఞానం లేని దోషమని చెపుతున్నాను. కనుకనే

"ఈ కృతు లనేకములు భావగీతము లని ఇప్పుడు ప్రచారమునకు వచ్చిన కొత్త కవితాప్రపంచమునకు చేరినవి. సంస్కృతధాస్యమునుండి విముక్తుల మగుచున్నామని నానమ్మకం."

(తొలకరిపీఠిక. రామలింగారెడ్డి.)

"పాశ్చాత్యాదర్శముల ప్రోద్బలము దొరకునంతవరకు మన కవులు పాడినదే పాడవలసినవారైరి. నవీనమార్గరచనలలో ముఖ్య మైనది లిరిక్ అను ఆంగ్లేయరచనకు." (తృణకంకణ ప్రకాశకులు )