ఈ పుట ఆమోదించబడ్డది

132

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

అధిక విశేషణగణం తప్ప తక్కినదండగమాటలు కృష్ణకర్ణామృతం, శ్రీనాథాదులకృతులు మొదలైనవాటిలోవలె నేటికాలపు అనేక కృతుల్లో తగ్గడం సంతోషహేతువేగాని వీటి అన్నిటిబదులు అధికవి శేషణగణం ప్రబలింది.

"దివ్యనిర్మలరత్న దీపంబనైపుట్టి,
 లలిత మోహనకలాలాపంబనై పుట్టి"
           (నిర్వేదం. వేంకట పార్వతీశ్వరకవులు.. భారతి)

"ఉద్యద్యశః ప్రాదుర్యాచ్చసుధా" (భారతి)

"ఉరువై సృత్యతమిస్రపుంజ రచనో ద్యుక్తంబులౌ "

"సుస్థిరకాంతి స్థగితంబుగా"
           (పెమ్మరాజు లక్ష్మీపతి. భారతి. 2-9)

"క్రౌర్యకౌటిల్యకలుష పంకంబువలన" (కృష్ణపక్షం.)

"హృదయదళనదారుణ మహోగ్రకార్యంబుదలచిపోవు."(కృష్ణపక్షం)
 
"ఇంపుదళ్కొత్తపాటల సొంపుమీరె."
               (పెద్దిబొట్ల రామచంద్రరావు. బియల్ క్లాసు. ఆంధ్రహెరాల్డు.)
 
"రేఖామంజులవాసనాలహరి"
              (విశ్వనాధ సత్యనారాయణ, అనార్కళి. భారతి.)

యిట్లా యీకాలపుకృతులను అధికవిశేషణగణం కలుషితం చేస్తున్నది. వక్ష్యమాణమైన శబ్దవాచ్యత దండగమాటల కిందికి గూడా వస్తున్నదని యిదివరకే తెలిపినాను. అధికవిశేషణ రూపమైన దండగమాటలతో పాటు యతిభంగం. పాదభంగం, భాషావ్యతిక్రమం,