ఈ పుట ఆమోదించబడ్డది

108

వాఙ్మయ పరిశిష్టభాష్యం నేటికాలపుకవిత్వం


స్ఫుటప్రతీతికి ఆవశ్యమైతే తప్ప ఊరక మాటిమాటికి కక్కుర్తిపడి వెళ్లపెట్టితే శబ్దవాచ్యత అని అసహ్యపడ్డ భారతీయసాహిత్య వేత్తల భావమనోజ్ఞత వాస్తవంగా ఆరాధ్యమై వున్నది.

"రసస్యోక్తిః స్వశబ్దేన స్థాయిసంచారిణోరపి" అని విశ్వనాథుడు ఇట్లానే తక్కినసాహిత్యవేత్త లన్నారు. అందుకే లజ్జను ఎలపడానికి

"జాతా లజ్జావతీ ముగ్ధా ప్రియస్య పరిచుంబనే"

(ప్రియుడు ముద్దుపెట్టుకొనగానే ముగ్ద లజ్జావతి అయింది) అనడం కంటె

"ఆసీన్ముకుళితాక్షీ సా ప్రియస్య పరిచుంబనే" ఇతి లజ్జాయా అనుభావముఖేన కథనే యుక్తః పాఠః

(ప్రియుడు ముద్దుపెట్తుకొనగా ముకిళితాక్షి అయింది అని అనుభావముఖానచెప్పడం యుక్తం) అని సాహిత్యదర్పణకారుడు చెప్పుతున్నాడు. శబ్దవాచ్యతవల్ల వెగటు. భావానికమితత్వం, ఆపతితమై ఆ స్వాదానికి క్షతికలుగుతున్నది. అందుకే

"స్వశబ్దవాచ్యత్వం రసాదిప్రకర్షబోధప్రతిబంధకం"

అని సాహిత్యదర్పణవ్యాఖ్యాత రామచంద్ర తర్కవాగీశభట్టాచార్యుడు తెలిపినాడు.

కావ్యప్రదీపంలో "హా!మాతః" అని కరుణానికి ఉదాహరించిన శ్లోకానికి వ్యాఖ్యవ్రాస్తూ దాంట్లో "ఘర్ఘరమద్యరుద్ధకరుణాః" అనేభాగంలో వున్న "కరుణాః" అనేదానికి "సస్నేహాః" అని అర్ధం వ్రాసి "నాతో రసస్య శబ్దవాచ్యతాదోషః (కా. ప్ర. వ్యా) (అందువల్ల రసానికి శబ్దవాచ్యతాదోషం లేకుండాపోయింది) అని వైద్యనాథుడు వ్రాస్తున్నాడు.

ఇట్లా శబ్దవాచ్యతవున్న సందర్భాల్లో
"............ఆస్వాదానుత్పత్తిర్దోషత్వ బీజమితి సంప్రదాయ"
(ఆస్వాదానుత్పత్తి దోషత్వ బీజమని సంప్రదాయం)