ఈ పుట ఆమోదించబడ్డది

70

వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటి కాలపుకవిత్వం


ప్రసాదించడానికి వనకుమారికర్త పడ్డ శ్రమలో నాల్గవవంతు భారతీయ విజ్ఞానంప్రాప్తించడానికి పడినట్లయితే ఆ అమేయ విజ్ఞానాన్ని మేళగించి వ్రాసినా వ్రాయకున్నా ఇట్లా పెద్దలంటారని బుద్ధి పరిపాకాన్నీ, వినతిని, అయినా కనబరచే వాడు.

ఇట్లనే భారతి సం 3. సం 1. లో రాయప్రోలు సుబ్బారాయకృతి ధ్యాన గీతవున్నది. యేదో తత్వం తెలుపబోయి ధ్యానగీతకర్త నేను బ్రాహ్మముహుర్తంలో మేలుకొన్నాను, నా అహంకారం కదలలేదు, నేను ఉపనిషత్తు పఠించాను, దేవీపంచరత్నాలు చదివినాను. రామకథ మీదికి మనసుపోయింది. తరువాత భాగవతంమీద బుద్ధిపుట్టింది, నాకేమి తోచలేదు. తరువాత అనువాకాలకు తిరిగినాను, అని తనచర్య వ్రాశాడు. చివరన అయోమయంలోకి దిగి వదలినాడు. దీన్ని తరువాత నిరూపిస్తాను. అనంతరూపంతో విస్తరించివున్న తత్వజ్ఞానం యొక్క శిఖరం ఆరోహించి సర్వ భావాలను వశపరచుకొని మనకు నూతనవిజ్ఞానం ప్రసాదిస్తే వారిని తప్పకుండా ఆరాధిస్తాము. కాని చెప్పగలిగినది. చెప్పవలసినది యేమీ లేనప్పుడు తత్వంలోకి దిగితే అది నిస్సారపు అయోమయపుమాటలలోనీకే పర్యవసిస్తుంది. తత్వంవ్రాస్తామా? అది వేదాంతవిజ్ఞానవిలసితులకు గ్రాహ్యంగా వుండవలెను. లేదా ఆసామగ్రి లేనప్పుడు ఊరుకొనడం ఉచితం. "ఆకున ఆందని పోకనపొందనీ" యేవో నాలుగుమాటలు పులిమి, బులుపుతీర్చుకుంటే తీర్చుకోవచ్చును. తెలియనివారు తెలియకుండా వాటిని చదవవచ్చునుగాని వాటిని అయోమయపు ఆజ్ఞానవచనాలని సంస్కారవంతులు నిరాకరిస్తారు.

అని శ్రీ... ఉమా కాస్త నిధ్యాఖగకృతీలో వాజ్మయసూత్ర

పరిశిష్ట్రంలో తత్త్వజిజ్ఞాసాధికరణం సమాప్తం.