పుట:NelooreJillaGramaNamaluBhashaSamajikaParishilana.djvu/133

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోట కైపియత్తు - కలియుగం పుట్టిన తర్వాత శాలివాహనశక వరుషంబులు ---- అగు నేటి దుర్మతి సంవత్సరములో తొండమాన్ చక్రవర్తి అనే రాజు ప్రభుత్వం చేస్తూవుండగా దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తికి యీశాన్యం మూడు ఆమడలు పూర్వ సముద్రానికి ఆరు ఘడియల దూరములోనున్నూ వుండే సువర్నముఖినదికి ఉత్తరభాగమందు నది గర్భమైన స్థలమందున చుట్టూవుండే అరణ్యం ఛేదించి ఆ స్థలమందున వక గ్రామం కట్టించువలెననని కౌశికగోత్ర సంభూతుడైన బాల వీరప్ప అనే ఆయనున్నూ భారద్వాజస గోతృడయిన న్మే నారినాయుడనే ఆయననున్నూ అరవ కరణాలు వీరు రాజుగారి దగ్గిర ప్రముఖులుగా వుండి మనవి చేశినందును రాజుగారు అదేప్రకారం అంగీకరించునందున పైనచెప్పిన ప్రదేశమందు వుండే అరణ్యం నరికిస్తూవుండగా వక గొప్ప పొగపట్టున చెట్టు నరుకుతూ వుండె మనిషిమీద వక శక్తి ఆవహించి