వరియన్నమే ఎరుగము. బిడ్డలకు తల్లి ఎటువంటిదో ప్రజలకు రాజులటువంటివారు. మా పితరులు మమ్ములను చూచినట్లే మీరు మమ్ములను చూడవలయునని చెప్పగా, అశోకునికి కళింగ యుద్ధములో జ్ఞానోదయము కలిగినట్లు మంత్రికి బ్రాహ్మణపల్లెలో మనఃపరివర్తన గలిగి రాయలు గుర్రములకై యిచ్చిన ధనముతో, బావులు, చెరువులు త్రవ్వించుటకు నిశ్చయించెను. అనంతసాగరము, వరికుంటపాడు కొండలను రెండు ఫర్లాంగుల దూరము కల్పి కేతామన్నేరు నదికి అడ్డముగా క్రీ.శ. 1520-21లో కర్రపోయించి మెట్టపంటలు నాశనము కాకుండ చూచుటయేగాక వరిపంట పండునట్లు చేసెను. ఇట్లు కొండముర్సయ్యకు చెరువులు, గుళ్ళు తమ తల్లిదండ్రుల పేరట కట్టించి, గుర్రముల కొనకయే రాయలవద్దకు తిరిగిరాగా, రాయలు కోపగించి యిరువదినాల్గు గడియలలో గుర్రములు తేనిచో తల తీయుదునని ఆజ్ఞాపింపగా ముర్సయ్య అధైర్యపడక మల్లమ్మదేవిని ప్రార్ధింపగా 2000 గుర్రములు తెల్లవారునప్పటికి రాయల ప్రాంగణములో నుండుట గాంచి, అచ్చెరువంది కొండముర్సయ్యను క్షమాభిక్ష వేడెనట! తరువాత కృష్ణదేవరాయలు ఆ చెరువులు పరిశీలించుటకు తన తమ్ముడు అనంత దేవరాయలతో వచ్చినట్లును, అనంతదేవరాయలు పేరిటనే చెరువు, గ్రామము అనంతసాగరమని పేరు పెట్టబడినట్లు పెద్దలు చెప్పుదురు. ఈ కథ ఎంతవరకు సత్యమో విచారణీయము. (వి.మం.స.పు - 51-53)
పుట:NelooreJillaGramaNamaluBhashaSamajikaParishilana.djvu/102
ఈ పుటను అచ్చుదిద్దలేదు