పుట:NelooreJillaGramaNamaluBhashaSamajikaParishilana.djvu/101

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంత. సాగరం

ఉదయగిరి రాజ్యమునకు 1509 నుండి 1530 వరకు కార్యకర్త రాయసం తిమ్మరుసయ్య కుమారుడు కొండముర్పయ్య. ఇతడు గూడ మంత్రి తిమ్మరుసు కుమారుడు కాదు. క్రీ.శ. 1519 - 20 క్రీ.శ. 1520-21 లో కలువాయి అనంతసాగరముల చెరువులను త్రవ్వించెను. ఆనాటి ఉదయగిరి రాజ్యములో ప్రస్తుత ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, కనిగిరి, పొదిలి, రావూరు, నెల్లూరు తాలూకాలుండెనని అచ్చటి శాసనములబట్టి చెప్పవచ్చును. ఈ మహాకార్యములను గురించి ఈ కింద వదంతి గలదు. కృష్ణదేవరాయలు కొండముర్పయ్యను పిలిచి యుద్ధమునకు కావలసిన గుర్రములను తంజ నగరాధీశ్వరుని వద్ద కొని తీసుకొని రమ్మని 10,000 వరహాల నిచ్చెనట. కొండ ముర్పయ్య సపరివారంగా ఉదయగిరి నుండి బయలుదేరి బ్రహ్మవరం (ఇప్పటి బొమ్మవరం) మంగమ్మపల్లి (మంగుపల్లి), కామిరెడ్డిపాడుల మీదుగా బయలుదేరి వచ్చుచు ప్రస్తుత అనంతసాగరం చెరువు ప్రాంతములో విడిసి విశ్రాంతి తీసుకొనుచుండగా అకాల వర్షము కురిసి కేతామన్నేరు వెల్లువ వచ్చుటచే తన మజిలీని తక్షణమే మార్చుటయే గాక ఏటి ప్రవాహము వలన పండియున్న మెట్టపైరులు పాడగుట చూచెను. ప్రజలు వారి సారవంతమైన భూములు కేతామన్నేరు ప్రవాహము వలన నాశన మగుటను విన్నవించిరట. బ్రాహ్మణపల్లిలో (కలువాయి దగ్గర) మరియొక మకాములో ఒక వృద్ధురాలు మంత్రికి రాగి సంకటి పెట్టెనట. అప్పుడు మరుపయ్య అవ్వా! యీ యూరిలో బియ్యం దొరకవా? అని ప్రశ్నింప, నాయనా? రాజులకు వారి సామ్రాజ్యమును విస్తరించుటకే సరిపోవుచున్నది గాని, ప్రజల కష్టసుఖముల విచారించుటకు తీరిక లేకున్నది. మాకు వేసవిలో నీరుండవు,