పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది


గొంచెమైననుదానిచేఁ గూడిరాదు;
కాన, నట్టిచో ధైర్యంబె పూనవలయు. 30

తే. ఎంతజాగ్రత్తతోనున్న, నెన్నఁడేని
నొక్కసమయంబున విపత్తులొదవకుండ
వట్టిపట్టులఁ గీడు పోఁగొట్టుకొనెడు
వెరవురోయంగఁజనుఁగాని వెఱవఁదగదు. 31
                     సత్యము.

తే. తండ్రిదండించు, గృహమునఁదల్లితిట్టు
గురుఁడుపాఠశాలకుఁబోవఁగోపపడును,
తోడిబాలురుదూషింత్రు తులువయనుచుఁ,
గానఁగూడదు బాలుండుకల్ల లాడ. 32

ఆ. పాఠశాలలందు బాలురుకొందఱు
తప్పుచేసి, దానిఁ గప్పిపుచ్చ
బొంకుచుందురదియుఁ బూర్వపుదానితోఁ
గలియ, రెండుకానె కానిపనులు? 33

ఆ. ఎప్పుడైనఁగల్ల నించుక పలికిన,
నమ్మ రెన్నఁడితరనరులు వాని;
దఱుచునీతిమాలి, దబ్బఱలాడెడు
చెడుగుమాట వేఱు చెప్పనేల? 34

ఆ. ప్రాణహానియైన,బంధుహానియునైన,
విత్తహానియైన, వినుముకడకు
మానహానియైన మఱియేమియైనను,
బొంకకుండుఁవాఁడె పుణ్యతముడు. 35
                   జీవహింస.

ఆ. చీమ మొదలుగలుగు చిన్న జంతువులకు
హింసచేయుచుంద్రుహీనమతులు;