పుట:Neetideepika Kandukuri Veeresalingam.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

14 నీతి దీపిక

దనకుఁగలదానిలోనెయీఁదగునుగాని,
దాతనని, యప్పుఁగొనియియ్యఁదగవుగాదు. 66


తే. కుంటివారలువృద్ధులు గ్రుడ్డివారు
లోనుగాఁబాటుపడశక్తిలేనివారి
కియ్యవలెఁగాని, యితరులకిచ్చి దాన
మహిని వెలయింపరాదుసోమరితనంబు.67

తే. మనముగడియించుదానిలో, మఱిచిపోక
నిలువచేయంగఁదగుఁగొంతనేర్పుమెరసి
వార్ధకంబున, రోగముల్ వచ్చునపుడు,
గడనఁజేసెడుసామర్ధ్యముడుగుఁగాన.68

ముఖస్తుతి

తే. ఇంద్రుఁడవునీవుచంద్రుఁడువీవటంచు,
దాపునను జేరియొనరించు స్తవమునకును
కాయముప్పొంగివిశ్వంబుఁగానలేక,
చేతిసొమ్మెల్లఁబోవిడిచెదవుసుమ్ము? 69

ఆ. సరసఁ జేరి, నిన్ను సంస్తవమొనరించు
వారలెల్ల సుఖులుగారునీకుఁ;
గష్టకాలమందుఁ గాచువాఁడొక్కఁడె,
నిక్కమైనసఖుఁడు నీకుఁదలఁప. 70


తే. ధనముగలిగినయన్నాళ్ళు, దానిలాగ
వెంటఁదిరుగుచునుందురు, విహితులట్ల;
ధనముపోయినమఱునాఁడు దలఁపవారు
తొంగిచూడరునీయిల్లుదూరమునను. 71