హేమ్లెట్టు తనతండ్రి మరణమునకు మఱియు దనతల్లిం దనపినతండ్రి పెండ్లాడి రాజ్యమాక్రమించుకొనుట కా దైవమే కారణ మని నమ్మి పగదీర్చుకొనుతలంపు మానవునికి చిత్రము. సకల కార్యములకు దైవమే కర్తయను దృఢవిశ్వాసము గలవా డేపనికైన నంతగా దీవ్రప్రయత్న మొనరింపజాలడు. సుకపర్యవసాన నాటకములలొ సుకమార్గములబన్ని పాత్రమునకు జిఱునగు మోములబ్రతుకు గల్పించునట్లు లేనిపోని యూహలతో దు:ఖావ సాన నాటకముల భూమెకల కేట్టులో భీభత్సమరణములం గప్పానిప్ప సమర్ధులమని తెచ్చిపెట్టు బుద్ధివైపరీత్య మేనుపడవచ్చును.! కానిచో రంగస్ధలమునకు దొలుత నొక ముదుసలివాని, వానికూతుతో గూడ బలియిచ్చి యాపిదప నొకదుష్టమిధునము, న్మఱియు రాచపీనుగు తోడులేక పోవడను నట్లొక యవివేకపుపడుచు రాచకొడుకు నింకొక వీరునితో జతపర్చి ఘోరముగ గూలిండుత చూపఱ నేత్రముల కానందమా? లేక లోకోపకార నీతిబోధకమా? కవితాప్రతిభ కొకనిన్నియయా? ఓపిలాకు హేమ్లెట్ట్ల జంపించుటకై వాని పినతండ్రి యాంగ్లదేశమునకు బంపివేసినట్లు స్పష్టముగా దెలియబర్చినచో నాపె యత్మహత్యకు దగినకారణం నాటకమున నగపదుగదా! ఏలోపము లెట్లున్నను లోమౌలో బ్రాజ్ఞలందఱున్ హేమ్లెట్టు నాటకంబు లన్నిట నుత్తమ మనై తలంచినపుడు నే గాదన జెల్లునా? హెమ్లెట్టువంటి పండితునకు దయ్యముమగపడి యుపన్యాస మిచ్చుటయు మఱియు నామాటచొప్పున నతడు తనతో గూడ దనకులము నంతయుం బోలియుండుకొనుట - యిట్టి కధ పిల్లకాయలకైన నసంభవముగా దోచదా? కధకుగాల్చేతులు లేవు. ఈ లోకములో జరుగని యసందర్భము లెవ్వి, తక్కిన యంశముల జోలి నీకేల, కవితాచాతుర్య్హ మెట్లున్నదని షేక్స్పియరుని కవిత్వప్రతిభకు మార్తాండప్రభకును లోపమెవడెంచగలడు? షేక్స్పియరుని నాటకములు కావని శంకింపబడిన యవి తప్ప దక్కిన యిరువదియైదింటిలో నీతిబోధకము 'కొరియెలా
పుట:NavarasaTarangini.djvu/39
ఈ పుట అచ్చుదిద్దబడ్డది