గాని మఱియటువంటి సన్నిహిత బాంధవ్యముకల పెద్దలెవరైనగాని తనపినతండ్రి తనతండ్రిం జంపి రాజ్య మాక్రమించుకొన్నట్లు తనతో జెప్పియుండలేదు. ఇంతియేకాక తనపినతండ్రి తనతల్లిం బరిణయమైన వెంటనే రాజ్యమునకు నాపిమ్మట రాజువీనని యెంత యో ప్రేమతో బహిరంగముగా రాజసభలో నిష్కపటముగ వక్కాణించెను. గాబట్టి హేమ్లేట్టు లేనిపోని యనుమానముపడి పెద్దల నరయక పడుచుతనపు టవివేకముతో దీవ్రోన్మాదమెత్తినట్లు నటించుచు దావలచి వలపించుకొన్న-కన్నియ నాతండ్రి న్మఱియు దనతల్లిం దనపినతండ్రి మొదలగు నాత్మబంధువుల బొలియించి కోరి తనమిత్తికి దాహేతువయ్యె, అట్లు తన ప్రియురాలికి, తల్లికి, తన వంశమునకు జెఱుపుచేసి తాజెడిన కుఱ్ఱని దుస్సాహస మొకనాటక ముగా బన్నుట లోకులకు సునీతిబోధక మెంతమాత్రము గాదు. ద్రోహము గావించి నదిబెండ్లాడి రాజ్యమాక్రమించుకొన్న తన దౌర్జన్య ముం బ్రతిక్షణము జ్ఞప్తికి దెచ్చుకొనుచు బశ్చాత్తప్తుడగుచు భగవంతుని దననేరముంనైచుమని ప్రార్ధించుచుటచే హేమ్లెట్టు పినతండ్రి హేమ్లెట్టుకు కోఫీలానుబెండ్లి గావించి వానికిం బట్టముల గట్టి తానోరసిలి యుండక మీదుమిక్కిలి హేమ్లెట్టు బొలియింపజూచుట ప్రాజ్ఞ స్వభావము కానేరదు. ఒకవేళ పూర్వ గాధ ననుసరించి చేసినను షేక్స్పియరుని వంటి మహాకవి యింత యసందర్భముగా నొక పడుచువాని దుస్సాహసముచేగుల నాశనమగునట్లు దు:ఖ పర్యవసాన నాటక మొనర్చుట సునీతిబోధనఫలకమగు కావ్యమునకే తలవంపుతెచ్చె. ఒకకోడెకాడొక యెలజవ్వని న్వలచి యుండియుం బిట్టకొంచెము కూతఘనమను నట్లు మునీశ్వర్హారమగు జ్ఞానవైరాగ్యం లగుపర్చుట నూత్నయౌవన స్వభావము కానేరదు. మనకార్యములు నెరవేర్చు దైవమొకటి కలదు. దానివశమున సర్వము జరుగు చున్నదని స్నేహితునకు జెప్పిన
పుట:NavarasaTarangini.djvu/38
ఈ పుట అచ్చుదిద్దబడ్డది