ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నొండొందుమీఱి కన్నడ నెద్దాననైన దృప్తిపడ కెద్దియందోచు తుదకెవ్వి యో కొన్నిమాత్ర్రం తెచ్చుకొనినట్లు మఱియు నాకలి గొనువా డొక దానికన్ననొకటి క్రొంజవులనొప్పి పలుతెఱంగులుదుఱంగలించు సంటకంబులు దొరకునెడ నెద్దియం గడుపునిండ దిన లేక వచ్చినట్ల య్యె, నాకుని ఆయిరువుర కబ్బమ్లందలి సౌందర్యము కొనియాడ వేనోళ్ళు చాలవు. పున్నమచందురుం జూచినకొలంది దనివితీఱని తీరున వారలం జదివినకొలది సంతుష్టితీఱదు. మఱియు ఖగోళ ములగాంచి యానందించి వానిం గూలంకషంబుగ దెలియంజాలనట్లు వారి యూహలత్యామోదకరములయ్యు గొన్నిచోట్ల దురవగాహములు, సముద్రమువలె వారల కవితాశక్తి యపారము. దిగంత రేఖకరణివారి యుద్దేశము కొన్నితావుల సందీయంచకుండును. వారి వాక్చమత్కృతి యనిర్దేశ్యము, సరియె ఆ మహాకవీశ్వరులు లోకప్రసిధ్దులు. నేనేఱేతెల్పనేల? నిజమగు కవులొకరికొకరీదుదీయకుంద్రు. వారిలో నొండొరులం బోల్చ వీలుకా దెపనిముట్టుకు వాడే ఘనుడు.

కవిత్వము-అనువాదము

    రసము చెడనీక యమకపుష్టిగ జెప్పుట, సందర్భశుద్దిగల పద ప్రయోగము, స్వతంత్రముగ గధనుగల్పించి యపూర్వమగు నూహలందెల్పుట, యతుకుంచక పద్యములల్లుట, పందితపామర రంజకముగ మృదు మధురోచిత శబ్దములం బొందుపర్చుటయం గవిత్వమున ముఖ్యాంశములు. సర్వసాధారణానుభవము న్యధోచితంబుగ దెల్పి జనుల హృదాంబులకెల్ల దనముప్పతిలు జేసి  నీతినుద్బోధించుటయే కవితకు దగు ప్రయోజనము, మఱియు నొకభాష యింకొక భాషకు సరిగా మాఱదు.  చాల మట్టూహం దెల్పునట్లు మాత్రమే. మార్చవచ్చుగాని యధాస్థితిగ భాషాంతరీకరణ మసాధ్యము. పుట్టుభాష తల్లి పాలవంటిది. పెట్టుభాష యెంతచదివి యంటించుకొన్నను బోత పాలవలె నంతగా నొడలపట్టదు. లాంతిభాషపొంకము కూలంకష