ఈ పుట ఆమోదించబడ్డది

నవరస తరంగిణి

పీఠిక

షేక్స్పియరు - కాళిదాసు

తులనాత్మక పరిశీలన: జగత్ప్రసిద్ధులైన షేక్సిపియర్కాళిదాసుల కవిత్వమందలి సొగసులు తెలుగువారలకు దెలుప దెలిగించినాడను. షేక్సిపియరాంగ్లేల్యభాషలో ముప్పదేడు నాటకములు న్మఱియు నాఱు చిన్న కావ్యముల నొనర్చెను. కేవలమాంగ్లభాషా పాండిత్యము మాత్రమే కలిగి సంస్కృత మెఱుగనివారు షేక్సిపియరు కాళిదాసునకంటె నెక్కువకవియనియు సంస్కృతజ్ఞానముండి యాంగ్లేయభాషా పరిచయము లేనివారు కాళిదాసున్మించినకవి లోకమున లేడనియును వాదించుచుందురు. గీర్వాణాంగ్లేయభాషలు రెండుంగూడ దెలిసిన వారి కాసందియ ముండనేరదు. ఇంతకు నొకభాషలోనే యిద్దఱు కవిత్వముచెప్పినపుడు వారల తారతమ్యము దెలుప సులభము. కాని వేఱు వేఱు భాషలయందు గవిత నొనర్చినవారల వాసి దెల్ప మిక్కిలి వీలుకాదు. భాషాగౌరవమునుబట్టి రసోన్నతి యగపడును. రాజునకు మఱియు సేవకునకు న్గలుగు రసము లుపాధిభేదంబుల గౌరవలాఘవము లందుననుటకు సందేహములే దింతకు రాజు మెచ్చినది రంభ యను సామెతయే తార్కాణము. భాషలకెల్ల సంస్కృతము తల్లియు న్రాజువంటిది. రాజల్గెను - లోకులెల్లరన్ భయపడజొచ్చిరి. మఱియు నతడు చిఱునవ్వునవ్వెను - జనులంద ఱుల్లాసమందిరి. సేవకుని యల్కగాని, నగవుగాని, యంతగా లక్ష్యముసేయబడవు. స్వతస్సిద్ధమగు దేవభాష న్జదువునపుడు రసోదయమగునట్లు దేశభాష న్జదువ గానేరదు. పాలకొకరుచి, యద్దియే పెరుగు, వెన్న, నేయి