ఈ పుట ఆమోదించబడ్డది

8

నవనాథచరిత్ర

పారద విశదప్ర ◆ భా రమ్యమైన
కలధౌత నగముపైఁ ◆ గమలజ విష్ణు

శివుని కొలువు


బలవైరి శిఖ కాల ◆ పలలాద వరుణ
పవన యక్షేశ్వర ◆ [1] ప్రముఖ నిలింప
నివహంబులును రజ ◆ నీచర గరుడ
పన్నగ తాపస ◆ ప్రవర గంధర్వ
కిన్నర చారణ ◆ కిం [2] పురుషులునుఁ
బరమయోగీంద్రులుఁ ◆ బ్రమథులుఁ గొలువఁ
బరగఁ జింతామణి ◆ భద్రపీఠమునఁ
జలికొండకూఁతుఁ బొ ◆ చ్చము లేని ప్రేమ
తలుకొత్త వామాంక ◆ తలముపై నునిచి
భరతకళాప్రౌఢిఁ ◆ బరగ వృషేంద్రు
కరమునఁ బరిపరి ◆ గతులకు మొరయు
మురజనాదంబుఁ దుం ◆ బురు గీతరవము
నారద రణిత వీ ◆ ణా నినాదమునుఁ
బలుమాఱు వీనుల ◆ పండువు [3] సేయ
విలసిల్లు నప్సరో ◆ విభ్రమ గతులఁ
దలకొని లోచనో ◆ త్సవ మొనరింప
గొలువున్న యా జగ ◆ ద్గురు నుమారమణు
బాలేందు శేఖరు ◆ భక్తమందారు
నీలకంధ్రరుఁ గొల్వ ◆ నెఱి వచ్చినట్లు

వసంత వర్ణనము


తరుల ప్రాయపుమందు ◆ తావులపొందు
విరహుల మంట కో ◆ విల [4] గమిపంట
రతిసుఖంబుల చొక్కు ◆ రసికుల మ్రొక్కు
రతిరాజు జోక వి ◆ రక్తులఢాక
పువ్వుబోణుల యుబ్బు ◆ పుష్పాస్త్రు గబ్బు
పువ్వుఁదేనెల పెచ్చు ◆ భోగుల మెచ్చు
వెలయ వసంత మ ◆ వ్వేళ నెల్లెడలఁ
గలయంగఁ బద నింకి ◆ కడవళ్లు వాడి

  1. ముఖనిఖిలంపు.
  2. పురుషవరులు.
  3. సెలగ.
  4. గమిపెంట.