ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvi

యచ్చట సంజీవకరణి, సంధానకరణి, పరుసవేది, చింతామణి మొదలగుదివ్యౌషధములను మఱికొందఱ శిష్యులను బడసి, వారిని సిద్ధులుగాఁ జేసి, పశ్చిమాంబుధితీరమున మంగళాపురమను (Mangalore?). పుటభేదనము డాసి, యా పురిని రాజు మృతుడౌటఁ దెలిసి, యాతని కాయమునఁ బ్రవేశించి, కొంతకాల మాపురము నేలుచు రాజ్య వైభవములను నైహికసుఖముల ననుభవించి యొక సుతునిఁబడసి గోరక్షకుని ప్రబోధమున మరలఁ దన కళేబరమునఁ బ్రవేశించి, శిష్యులతోఁ గూడి, ఉజ్జయని, ద్వారక, అయోధ్య, కురుక్షేత్రము, కాశి, ప్రయాగ మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించుచు, హిమవత్పర్వతమును జేరి, శిష్యులతో,

"మీరు మీ నేర్పున మీ కథలెల్ల
 ధారుణిపైఁ బ్రసిద్ధముగాఁగఁ జేసి
 సన్నుతి యోగశాస్త్రములు మీ పేరు
 విన్నఁ గౌతుకమార విరచించి మఱియు
 గురుభక్తి నిరతుల గుణరత్న నిధులఁ
 దెలిపి యోగం బుపదేశించి దెసల
 గలయఁ ద్రిమ్మరుచుండఁగా నియమించి
 మగుడ చలికొండ కేతెండు చనుఁడింక”

 నని చెప్పిపంపెను.

 అట్లు పంపిసశిష్యులలో -

“మళయాళ బర్బర మగధాంధ్ర పాండ్య
 చోళభూములు చనఁజొచ్చె విజ్ఞాన
 శీలనాగార్జున సిద్ధుఁడింపార"

ఈతని శిష్యుఁడగు సిద్ధనాగార్జునుఁడు శ్రీశైలప్రాంతమునఁ దిరిగి, రసవాద మహిమనుజూపి, శ్రీశైలము నంతను హాటకమయముగాఁ జేయ యత్నించి, తుదకువిష్ణుని చక్రమున " కాహుతియై విఫలుఁడయ్యెను. కాని మీసనాథుఁడుగాని యాతని వెంట నంటియున్న సారంగధరుఁడుగాని యాంధ్రదేశమునకు వచ్చినట్లైననుగనఁబడదు. ఇట్లీనవనాథుల కథలన్నియు హిందూదేశమునఁ బశ్చిమతీరభాగమునకు సంబంధించిన ట్లగపడుచుండఁగా, నిందుఁ బ్రధాన పురుషులలో నొక్కఁడును, మీననాథుని తొలి శిష్యుఁడును నగు సారంగధరుని గూర్చిన కథ యాంధ్ర దేశమునకును, నందు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రవరమునకును సంబంధించినదిగాఁ జిరకాలమునుండి యీ దేశమునఁ దలంపఁబడుచుండుట యాశ్చర్యకరము కాకమానదు. ఈ భావ మెట్లెప్పుడు బయలుదేరినదో చెప్పుటకు సాధ్యముకాదు గాని, అప్పకవి నాఁటినుండియు నది