ఈ పుట ఆమోదించబడ్డది

332

నారాయణరావు

అతడు రాత్రి పన్నెండు గంటలకు కూర్చుండి ఉత్తరము లెన్నియో వ్రాసెను.

తెల్లవారగట్ల మూడగుచున్నది.

నెమ్మదిగ అడుగులిడుచు పుష్పశీల నిద్రించు గదిలోనికి బోయినాడు. ఆమె వాడిన పుష్పమువలె పందిరిమంచముపై పండుకొనియున్నది.

పుష్పశీల నొక్కసారి కౌగిలించుకున్నాడు. ఆమె నిద్దురలో రాజేశ్వరరావును తనకడకు లాగికొన్నది.

అతని కన్నుల రెండు చుక్కలు నీరు తిరిగినవి. ఆమె కౌగిలి సడలించుకొని ‘ఎప్పటికైనా ఆడవాళ్ళ బాధలకు పురుషులే కారకులు’ అని గొణుగుచు తన వ్రాతగదిలోనికి బోయి సోఫాపై పండుకొని ఒక పొట్లము నోటిలో వేసికొని మంచినీరు త్రాగుచుండగనే యాతని చేతిలో నుండి గ్లాసు క్రిందకు పడి బద్దలైనది. ఆతని చేయి వాలిపోయినది.

౧౦

శస్త్రచికిత్స

కొత్తపేట

10 గం. 20-4-29

తటవర్తి నారాయణరావు

అడ్వకేట్

హైకోర్టు, మద్రాసు.

మీ నాయన గారు - దుష్టవ్రణము - (మాలిగ్నెంటు ట్యూమరు) - వ్రేలి మీద - రేపు ఉదయం - మెయిలు - తీసుకొని వచ్చుచున్నాము - శస్త్రచికిత్స - రంగాచారి - ఏర్పాటు చేయి - స్టేషను - మోటారు - భయము లేదు.

రాజారావు’

అని తంతి నారాయణరావునకు చెన్నపురిలో హైకోర్టులో నున్నప్పుడందినది. నారాయణరావునకు హృదయం చలించి తల యొక్కసారి తిరిగినది. ఈ దుష్టవ్రణ మేమిటి? దీనివలన భయము లేదని తంతిలో వ్రాసియున్నది. అతడు తత్ క్షణమే రంగాచార్యులగారి యింటికిబోయి వారితో మాట్లాడెను. ఆయన యా తంతిని చూచి ‘రేపు తిన్నగా మా వైద్యశాలకు తీసుకొనిరండి. అన్నీ సిద్ధం చేయించి ఉంటాను’ అని చెప్పినాడు. విషవ్రణములలో భయపడ వలసినవి యున్నవి. ఏమి భయములేనివి యున్నవి. ‘భయము లేదా’ యని ప్రశ్నింప రంగాచారి గారు ధైర్యము చెప్పి నారాయణ రావును బంపించినారు. శస్త్రవైద్య మయిన వెనుక యొకటి రెండురోజు లుంచవలసినచో వైద్యశాల