ఈ పుట ఆమోదించబడ్డది

ఆం ధ్రు లు డాం బి కు లు

275

రాజా: ఆ ఉత్సాహం కూడా ఎక్కువకాలం ఉండదండి.

పర: దేశం అంతా గ్రంథాలయాలు అన్నారు. ఎక్కడచూస్తే అక్కడ గ్రంథాలయాలు కృష్ణదేవరాయ, వసురాయ, గౌతమి, రామమోహన, మోహనదాసు, తిలకు మొదలగు పేర్లతో దేశం అంతా గ్రంథాలయాలు. గ్రంథాలయ మహాసభలు, గ్రంథాలయ పత్రికలు. ఇప్పుడుచూస్తే ఏవో నాలుగో అయిదో బాగా పనిచేస్తున్నవి. తక్కినవి నామమాత్రా వశిష్టముగా కొన్ని, కొట్లాటలతో చప్పగా నశించిపోయినవి కొన్ని.

నారా: పత్రికలు రోజుకు రెండు బయలుదేరి నాలుగు నశిస్తున్నవి. ఎపుడో ఒకనాడు భీమాకంపెనీలు అలాగే బయలుదేరి నశించిపోయినవట.

పర: బందరులో పంచదార యంత్రాలయము, రాజనరేంద్రనగరిలో కాగితాల యంత్రాలయం, గుంటూరులో ఇనుపకర్మాగారం, ఏలూరులో గోనెగుడ్డల కర్మాగారము అలాగే అనేక కంపెనీలు బయలుదేరి, మాయమై పోయినవి కొన్ని, మరిగిపోతున్నవి కొన్ని.

రాజా: 1920 సంవత్సరములో ఊరికి ఒక జాతీయకళాశాల బయలుదేరినది. ఇప్పడు కొనఊపిరితో శారదానికేతనం ఒకటి ఉన్నది. బందరు జాతీయ కళాశాల ఎల్లాగో కాలం గడుపుతూ ఉన్నది, కాదురా నారాయణరావూ?

నారా: ఆశ్రమాల్లో పల్లెపాడు ఆశ్రమం ఏమయింది? ఆ మహానుభావుడు దిగుమర్తి హనుమంతరాయుడు పోవడంతోనే, ఆశ్రమం నశించింది.

శ్యామ: ఇది ఏమిటి ! అన్నగార్లు అంతా మనదేశాన్ని పట్టుకొని దూషిస్తున్నారే.

నారా: దూషణ పూర్తికావాలి శ్యామసుందరీదేవీ! కానీ పరం!

పర: తిట్టులు నువ్వే పూర్తి చెయ్యలేకపోయినావట్రా? సరే! ఒకసారి గబుక్కున దేశంఅంతా పరపతి సంఘాలు. ఎన్నో నశించాయి, కొన్ని సంఘాలు దివాళాతీశాయి. పోనీ, మూడురూపాయల వడ్డీకి మారువాడీ దగ్గర అప్పు తీసుకరావడం మానేరా అంటే అదీలేదు.

శ్యామ: దీనికంతకూ కారణం?

నళి: ఫీజు యిచ్చి ప్లీడర్ని పెడితేపిచ్చెత్తి యెదిరిపార్టీ తరఫున వాదించి ఎక్కడికో లేచిపోయిన వకీలులా ఉన్నారు మీరంతా.

నారా: హృదయదౌర్బల్యం. వెన్నెముక బలం లేకపోవడం. పట్టుదల హుళక్కి. నమ్మకము సున్న. అహంభావము అతిజాస్తి. ఒక్క నాయకుడు లేడు. అంతా నాయకులే. పెద్దలయెడ మర్యాదలేదు.