ఈ పుట ఆమోదించబడ్డది

268

నా రా య ణ రా వు

క్కొంటున్నారో లేదో ముందు నీకు తెలుస్తుంది. పేడనీళ్ళతో కడిగిన అన్నం తినడానికి ఇష్టంలేక ఆత్తవారింటికి వెళ్ళవు కాబోలు. మన అత్తయ్య ఆచారం తక్కువా, అంతమాత్రాన్న ఆవిడ పల్లెటూరి మొద్దుఅయిందా?

వరద: ఏమిటి శకుంతలా అది? ఊరుకోఅమ్మా శారదా! ఎందుకూ ఈ గడబిడ నువ్వు, పెద్దమ్మాయీ!

శకుం: ఎందుకా? పొద్దున్నుంచి నారాయణరావు నారాయణరావు అని అతన్ని ఆడిపోసుకోవడమే. మన యింటికి వచ్చినప్పుడల్లా యిదేవరస. విని విని చెవులు తడకలుకట్టి అన్నాను. నారాయణరావువంటి అల్లుడు తపస్సు చేసినా దొరకడు. విన్నావా అమ్మా? బాబయ్య గారు ఎందుకు కోరి తెచ్చుకున్నారు? మన సంబంధంకోసం శారద మామగారిని హేమాహేమీలు వెళ్ళి ఒప్పించారు. నీకు ఇష్టం లేకపోతే బాబయ్యగారితో నిజంచెప్పు. ఇలాంటి తెలివితక్కువలు చేస్తే జరిగే నష్టం నాకు తెలుసును. జరిగిన సంగతులు తెలిశాయి. తర్వాత విచారిస్తావు.

అందరూ తెల్లబోయినారు. వరదకామేశ్వరీదేవి కొమరిత గంభీర వాక్యముల కదరిపడి శారదవంక చూచినది.

శారద యచ్చట లేదు.

శారద చురచుర కోపముతో వెడలిపోయి, విడిదిమేడలో దమ కిచ్చిన గదిలో పందిరమంచముపై బరుండి, కంట నీరుదిరుగ వాపోయెను. ఆ దారిని పోవు జగన్మోహనున కది వినబడి గది తలుపు త్రోసికొని లోనికివచ్చి మేనమరదలిని జూచి, పట్టరాని తమకమున నొక్కగంతున నా మంచముదగ్గరకు బోయి, యామెను బిగ్గ గవుగిలించుకొని మోహావేశమున వణకు కంఠముతో ‘శారదా! ఎం ...దు ...కు ... ఏ... డు... స్తు ... న్నా ... వు’ అని యడిగెను.

శారద యేడ్పుమాని మాటలాడక యాతని బారినుండి తప్పించుకొని, గోడవైపుకు దొర్లి ‘యేమిలేదు బావా’ అన్నది. జగన్మోహను డా దివ్యసుందర విగ్రహము ఏడ్పుమోమున మరియు సుందరతరముగ గన్పట్ట, తమి నాపలేక, మంచముపైకి బ్రాకి, యామెను తనవైపుకు లాగికొని, యామె బుగ్గలను, కంఠమును, చెవులను, జడముడిని ముద్దాడుకొని మోము తనవంకకు ద్రిప్పికొని, పెదవుల ముద్దిడబోవుచుండ శారద చటుక్కున విదల్చుకొని ‘ఏమీలేదు బావా’ అన్నది. ఇంతలో శకుంతల చెల్లెలిని వెదకుచు నచ్చటికి వచ్చినది.


౧౭ ( 17 )

‘పి ల్ల లం టే ప్రా ణం’

శ్యామసుందరీదేవి తండ్రి పీమర్తి గోపాలకృష్ణయ్యగారు, మైసూరు వాస్తవ్యుడు. తెలుగు వెలనాటి బ్రాహ్మణుడు. ప్రసిద్ధ బ్రాహ్మసమాజికుడు. చెన్నపురి ప్రభుత్వపు పెద్ద వైద్యశాలలో ముఖ్యవైద్యులలో నొకడు. ఆయన