ఈ పుట ఆమోదించబడ్డది

కొ త్త పే ట

25


‘ఒరే తమ్ముడూ! నాకు తెచ్చిన యీ వెండి బొమ్మ సామానంత మంచివి కావురా మీవి?’ అన్నది యన్న కొమరిత.

మంచిరంగులు వేసి బొంబాయిలో జరీ పువ్వుల పని చేసిన పొందూరు కండువాలు చూచుకొనుచు, గంధపుబొమ్మలు మొదలైనవి గమనించుకొనుచు, సూర్యకాంతము ముసిముసి నవ్వులతో మురిసిపోయినది.

‘నారాయుడు మూడువందల రూపాయలకు తక్కువ ఖర్చు చేసి ఉండడు వీటికోసం. డబ్బంటే మంచినీళ్ళు తాగుతాడు’ అనుచు నన్నయగు శ్రీరామమూర్తి విస్తుపోవుచు జూచినాడు.

శ్రీరామమూర్తి కి తమ్ముడన్న నెంత ప్రేమయున్నదో, నారాయణరావుతక్క దక్కినలోక మెఱుగదు. తలిదండ్రులు, శ్రీరామమూర్తి భార్య వరలక్ష్మమ్మయు గొంచెముగా నెఱుంగుదురేమో. శ్రీరామమూర్తి, సుబ్బారాయుడు గారికి, జానకమ్మ గారికి ప్రథమ సంతానము. ముప్పదియేండ్ల యీడు వాడై, బి. ఏ., ప్లీడరుషిప్పు పరీక్షలలో గృతార్థుడై, యమలాపురములో వృత్తి జేయుచు, ధనము బాగుగా సముపార్జించుచు, బేరుగాంచిన న్యాయవాది యతడు. వ్యవహారముల నారి తేరిన బంటు. కోర్టు, ఇల్లు, తనయూరు, తన యాలుబిడ్డలు, తలిదండ్రులు, తమ్ముడు, చెల్లెళ్ళు, ఆలివంక బందుగులు, దగ్గర బందుగులు_అదియే యతని ప్రపంచము. సాంఘిక రాజ్యాంగ వ్యవహారములతో నాతనికి నిమిత్తము లేదు. మేనమామ పోలికతో గొంచెము స్థూల మనిపించు చామనచాయ రూపము. అయిదడుగుల ఏడంగుళముల పొడవయ్యు దమ్మునికన్న , దండ్రికన్న నాతడు చాల పొట్టి.

‘అన్నయ్యా! నీకోసం యీ మంచిగంధపు ఉత్తరాలపెట్టె పట్టుకు వచ్చాను. బాగుందా? దీని పనితనం చూడు. మూతమీద గోవర్ధనోద్ధరణం, లోపల కైలాసపర్వతం రావణుడు ఎత్తడం చెక్కి ఉన్నది. కింద రాముడు లేడికై పరుగెత్తడం, పక్కల్ని అశోకవనంలో సీత, బృందావనంలో గోపి కృష్ణులను చేశాడు. దీని ఖరీదు డెబ్భై అయిదు రూపాయలు.’

‘ఇంత చిన్న దానికే అంత ఖరీ దేమిటి రా!’

‘శిల్పపుపని విలువ అది’ అన్నది వదిన గారు.

‘ఏమమ్మోయి వదినా! నీకు తెచ్చిన పొందూరుచీర యిదిగో.’

‘ఎందుకురా పొందూరు కొనడం? మామూలు ఖద్దరులోనే సన్నరకం ఏ డెనిమిది పెడ్తే వస్తాయిగదుట్రా’ అన్నా డన్నగారు.

‘అదిగా దన్నయ్యా! బండఖద్దరుచీరలు కట్టుకుంటూంది. అసలే కొంచెం బొద్దుమనిషి. అందులో సాదాఖద్దరు చీరలు కట్టుకుంటుంటే రెండు రెట్లయింది వదిన అని, మూడు పాటినూలువి, ఒక పట్టుశాలీ నూలుది నాల్గూ కొనుక్కు చక్కావచ్చాను. అమ్మకి నాల్గు పట్టుకువచ్చాను. నీకు జరీకండువాలు రెండు. ఒకటి పొందూరుది, ఒకటి సేలంది. నాన్న గారికి బందరు పురిటి